Asianet News TeluguAsianet News Telugu

సైరాకు కేజిఎఫ్ సెంటిమెంట్ కలిసొచ్చేనా?

250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన పీరియాసిక్ డ్రామా సైరా అక్టోబర్ 2వ తేదీన విడుదలవుతుంది. ఇప్పటికే సెన్సార్ పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. మొన్న విడుదల చేసిన ట్రైలర్ ఈ చిత్రం పై అభిమానుల అంచనాలను అమాంతం పెంచేసింది.  ఫస్ట్ సాంగ్ ఆడియో కూడా అదరగొట్టి ఆల్రెడీ చార్ట్ బస్టర్ల లిస్టులోకెక్కింది. 

 

kgf sentiment on sye raa narasimha reddy
Author
Hyderabad, First Published Sep 26, 2019, 11:21 AM IST

సినిమాకు బజ్ క్రియేట్ చేయడంలో కూడా చిత్ర యూనిట్ కొత్త స్ట్రాటెజిలను ప్లాన్ చేస్తుంది. దక్షిణాది అన్ని భాషలతోసహా హిందీలో కూడా ఈ చిత్రం విడుదలవుతుంది. సైరా చిత్రం హిందీలో అదే రోజు విడుదలవుతున్న వార్ సినిమాతో తలపడుతుంది. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ వంటి యాక్షన్ హీరోలతోపాటు వాణి కపూర్ గ్లామర్ తోడయ్యింది. సైరా లో బిగ్ బి అమితాబ్ నటిస్తుండడం ఒకింత సైరా కు కలిసివచ్చే అంశం. 

అభిమానులు మాత్రం వేరే విషయంగా ఒక సెంటిమెంట్ ను చూసి ఆ సెంటిమెంటు నిజమైతే బాగుండు అని ఆశిస్తున్నారు. ఒక బాలీవుడ్ చిత్రంతోనే దక్షిణాది సినిమాలు నేరుగా పోటీ పడడం అరుదు. లాస్ట్ గా మనం చూసిన అలంటి ఒక పోటీ కన్నడ స్టార్ యాష్ నటించిన కేజిఎఫ్ చిత్రం

ఆ చిత్రం షారుఖ్ ఖాన్, అనుష్కా శర్మ, కత్రినా కైఫ్ వంటి నటీనటులు నటించిన జీరో సినిమాతో పోటీ పడింది. ఓపెనింగ్స్ అంతలా రాకున్నా కేజిఎఫ్ సినిమా పబ్లిక్ టాక్ వల్ల ఊపందుకొని భారీ కలెక్షన్లను రాబట్టింది. మరోపక్క జీరో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. 

ఈ కేజిఎఫ్ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసింది కూడా ఫర్హాన్ అక్తర్ కు చెందిన ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ. ఇప్పుడు సైరా చిత్రాన్ని హిందీ లో విడుదల చేస్తుంది కూడా ఈ సంస్థే.  మరో పోలికేమిటంటే జీరో సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసింది యాష్ రాజ్ ఫిలిమ్స్. ఇప్పుడు వార్ సినిమాను కూడా యాష్ రాజ్ ఫిలిమ్స్ విడుదల చేస్తుంది. దక్షిణాది చిత్రం అవడం, ఫర్హాన్ అక్తర్ సంస్థనే డిస్ట్రిబ్యూట్ చేస్తుండడంతో మెగాస్టార్ చిరంజీవి సినిమా హిందీలో భారీ స్థాయిలో కలెక్షన్లు రాబడుతుందని ఆశిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios