Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్‌ని కలసి ఈ సారి ఇంటర్వెల్ చెప్పాడట!

తన గత చిత్రాల తరహాలోనే ఈ సారి కూడా  డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో ఓ భారీ యాక్షన్ డ్రామా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ సినిమాని ఇంకా అఫీషియల్ గా ప్రకటించకపోయినా.. దాదాపు ఈ కాంబినేషన్ ఫిక్స్ అయిపొయినట్లే. ఇక ఈ సినిమాని పాన్ – ఇండియా స్థాయిలో దాదాపు 200 కోట్ల బడ్జెట్లో నిర్మిస్తారట. 

KGF Director's Movie With Jr NTR Confirmed
Author
Hyderabad, First Published Aug 12, 2020, 3:22 PM IST

‘కేజీఎఫ్’ సినిమాతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా పేరుతెచ్చుకున్న ప్రశాంత్ నీల్ … ప్రస్తుతం ‘కేజీఎఫ్ 2’ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో టాలీవుడ్ స్టార్ ,యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ మేరకు ఆయన ఆ మద్యన రఫ్ గా స్టోరీ లైన్ చెప్పారు. ఇప్పుడు రీసెంట్ గా ఎన్టీఆర్ ని కలిసి ...ఇంట్రవెల్ బ్లాక్ చెప్పినట్లు తెలుస్తోంది. కథ మొత్తంగా కాకుండా ఎపిసోడ్ వైజ్ ఆయన నేరేట్ చేస్తున్నారుట.  లాక్ డౌన్ సమయం పూర్తై షూటింగ్ లు ప్రారంభం అయ్యేనాటికి..,కథ చెప్పటం పూర్తి చేస్తాడని తెలుస్తోంది.

తన గత చిత్రాల తరహాలోనే ఈ సారి కూడా  డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో ఓ భారీ యాక్షన్ డ్రామా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ సినిమాని ఇంకా అఫీషియల్ గా ప్రకటించకపోయినా.. దాదాపు ఈ కాంబినేషన్ ఫిక్స్ అయిపొయినట్లే. ఇక ఈ సినిమాని పాన్ – ఇండియా స్థాయిలో దాదాపు 200 కోట్ల బడ్జెట్లో నిర్మిస్తారట. 

అలాగే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ దాదాపు బల్క్ డేట్స్ కేటాయిస్తున్నారని.. 2022లో సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. ఇక కేజీఎఫ్ చాప్టర్- 1 ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 250 కోట్ల‌ వసూళ్లు సాధించింది. దాంతో ప్రశాంత్ నీల్ కి మంచి డిమాండ్ ఏర్పడింది. ఏది ఏమైనా ‘కె.జి.ఎఫ్ 2’ను పూర్తి చేసి ప్రశాంత్ తెలుగు సినిమా మొదలుపెట్టనున్నాడు. 

ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించడానికి ముందుకువచ్చింది. భారీ బడ్జెట్టుతో రూపొందే ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకే బల్క్ డేట్స్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా వున్నట్టు సమాచారం. ఇక ప్రస్తుతం తాను చేస్తున్న 'ఆర్ఆర్ఆర్' పూర్తయిన వెంటనే, త్రివిక్రమ్ సినిమాలో ఎన్టీఆర్ నటిస్తాడు. దాని తర్వాత ప్రశాంత్ సినిమా మొదలవుతుందట.   
 

Follow Us:
Download App:
  • android
  • ios