ప్రశాంత్ నీల్ ఆల్ టైం ఫేవరేట్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఆ నాలుగు సినిమాలు ఎవరూ చేయలేరట!
దర్శకుడు ప్రశాంత్ నీల్ చేసింది నాలుగు చిత్రాలే అయినా... ఇండియా వైడ్ ఫేమ్ తెచ్చుకున్నాడు. ఈ పాన్ ఇండియా డైరెక్టర్ కి ఒక దర్శకుడు అంటే అమిత ఇష్టం అట. తాజాగా ఆ దర్శకుడు ఎవరో వెల్లడించారు.
కన్నడ సినిమాకు ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చిన దర్శకుడు ప్రశాంత్ నీల్ అంటే అతిశయోక్తి కాదు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన కెజిఎఫ్, కెజిఎఫ్ 2 ప్రభంజనం సృష్టించాయి. యష్ హీరోగా విడుదలైన కెజిఎఫ్ సిరీస్ ప్రశాంత్ నీల్ కి విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. సలార్ రూపంలో ఆయన మరో విజయం అందుకున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా సలార్ ఉంది. భారీ యాక్షన్ ఎపిసోడ్స్ లో ప్రభాస్ వీర విహారం చేశారు.
కాగా దేశం మెచ్చిన దర్శకుల్లో ఒకరిగా ఉన్న ప్రశాంత్ నీల్ ఫేవరేట్ దర్శకుడు ఎవరో తాజాగా తెలియజేశాడు. ఓ టెలివిజన్ షోలో పాల్గొన్న ప్రశాంత్ నీల్ ఈ మేరకు మాట్లాడారు. ప్రశాంత్ నీల్ కి ఉపేంద్ర ఆల్ టైం ఫేవరేట్ దర్శకుడు అట. అందుకు కారణం ఉందట. ఉపేంద్ర తెరకెక్కించిన ఉష్, A , ఓం, ఉపేంద్ర... చిత్రాలు చాలా ప్రత్యేకం. ఆయన సెటైరికల్ స్టోరీ టెల్లింగ్ ఎవరికీ సాధ్యం కాదని ప్రశాంత్ నీల్ అన్నారు.
అప్పట్లో ఉపేంద్ర దర్శకత్వం వహించి నటించిన 'ఉపేంద్ర' ఒక సంచలనం. కన్నడతో సమానంగా తెలుగులో ఆ మూవీ ఆడింది. ఉపేంద్రకు తెలుగులో ఒక ఇమేజ్ ఏర్పడింది. దాంతో ఆయన కన్నడ చిత్రాలు తెలుగులో కూడా విడుదలయ్యేవి. కొన్ని స్ట్రెయిట్ తెలుగు చిత్రాలు ఉపేంద్ర చేశారు. ఇక ప్రశాంత్ నీల్ కి ఉపేంద్ర ఇష్టమైన దర్శకుడు కాగా... అమితాబ్ బచ్చన్, శ్రీదేవి ఇష్టమైన హీరో, హీరోయిన్ అట.
ప్రశాంత్ నీల్ ఖాతాలో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ తో ఆయన ఒక మూవీ ప్రకటించారు. ఇది కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీ. అలాగే సలార్ 2 తెరకెక్కించాల్సి ఉంది. ప్రశాంత్ నీల్ అసలు కథ అంతా సలార్ 2లోనే దాచి ఉంచాడట. పార్ట్ 1కి మించిన యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషన్స్.. పార్ట్ 2లో ఉంటాయట. మొదటి భాగంలో ప్రాణ మిత్రులుగా కనిపించిన ప్రభాస్-పృథ్విరాజ్ సుకుమారన్ రెండవ భాగంలో బద్ద శత్రులు అవుతారట. ప్రధాన సంఘర్షణ వారి మధ్యే ఉంటుందట.