కన్నడ సూపర్ హిట్  KGF  సినిమా ఫ్యాన్స్ కు ఇది ఓ రకంగా  శుభవార్త  . పెద్ద హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ చిత్రం సీక్వెల్ ఈ సంవత్సరం  తెరపైకి వస్తుందా అంటే అవుననే అనిపిస్తోంది. కేజీఎఫ్: చాప్టర్ 2 విడుదల తేదీకి సంబంధించి ఎవరూ అధికారికంగా ఏమీ ఇప్పటి వరకూ ధృవీకరించనప్పటికీ ,  లేటెస్ట్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ చేసిన ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షించింది .  రీసెంట్ గా  ఈ సినిమా నిర్మాత విజయ్ కిరాగండూర్ పుట్టినరోజు జరుపుకున్నారు. విజయ్ దూరదృష్టి ,ప్రశాంత్ నీల్ పై నమ్మకం కేజీఎఫ్‌ను  సాధ్యం చేసింది. ఆయన  పుట్టిన రోజు ని పురస్కరించుకుని ప్రశాంత్ నీల్ చేసిన ట్వీట్ లో ..ఈ సంవత్సరం తమకు అతిపెద్దదిగా ఉంటుందని అన్నారు. 

ప్రశాంత్ నీల్ ఇలా ట్వీట్ చేయటం..అది కేజీఎఫ్ రిలీజ్ గురించే అని అందరికీ అర్దమై తలలు తిరిగేలా చేసింది. KGF: చాప్టర్ 2 రాబోయే నెలల్లో తెరపైకి వస్తుందని దీని అర్థం కన్నడ మీడియా వ్యాఖ్యానించింది. వారు  ప్లానింగ్ తో ముందుకు వెళితే ఇది మంచి  విషయమే అని,  అలాగే కంగారుపడితే ప్రమాదకర నిర్ణయం అవుతుంది. 

ప్రస్తుతం, బయిటపరిస్దితి అంతా గందరగోళంగా ఉంది. థియేటర్లు  రీఓపినింగ్  విషయాలు ఎలా ఉంటాయో ఎవరికీ  అర్దం కావటం లేదు. విషయాలు సాధారణ స్థితికి వస్తే  ప్రశాంత్ నీల్ చెప్పినమాటలు మంచిది, కానీ అలా కాకపోతే ఇది ఎంతో  ఇంట్రస్ట్ గా ఎదురుచూస్తున్న ఈ బహుభాషా సీక్వె ల్కు ఎదురుదెబ్బ  తగలవచ్చు. కేజీఎఫ్: చాప్టర్ 2 మరోసారి కల్ట్ రాకీ పాత్రలో యష్‌ను చేస్తున్నారు. సంజయ్ దత్ పోషించిన అధీరా రూపంలో అతను ఈసారి పెద్ద థ్రెట్ ఎదుర్కొ బోతున్నాడు. అతి త్వరలోనే విడుదల తేదీకి సంబంధించి మేకర్స్ నుండి అఫీషియల్ ఎనౌన్సమెంట్  కోసం వేచి చూద్దాం.