సెంటిమెంట్ డేట్ కే 'కేజీఎఫ్‌ 2' టీమ్ ఓటు


ఈ మధ్యకాలంలో ఆర్ ఆర్ ఆర్ స్దాయిలో క్రేజ్ తెచ్చుకున్న ప్రాజెక్టు ఏదైనా ఉంటే అది  'కేజీఎఫ్‌ 2' నే అని చెప్పాలి. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్  డైరక్షన్ లో యశ్ హీరోగా గతంలో రూపొందిన కేజీఎఫ్ సినిమా ఏ స్దాయిలో సంచలన విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే.

KGF Chapter 2 to stick to sentiment date? jsp

సినిమా ఫలానా రోజున రిలీజ్ అవుతుందని చెప్పేదాకా ఎవరూ పట్టించుకోని రోజులు ఇవి. అయితే కొన్ని సినిమాలకు ఆ మినహాయింపు ఉంటుంది. అలాంటివాటిల్లో లోకల్ స్టార్స్ సినిమాలు ఉంటాయి. అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తూంటారు. అలాంటిది ఓ డబ్బింగ్ సినిమా కోసం, అదీ ప్రక్క రాష్ట్రం హీరో సినిమా కోసం జనం ఎదురుచూస్తున్నారంటే గొప్ప విషయమే. అలాంటి సినిమానే కేజీఎఫ్ 2.

ఈ మధ్యకాలంలో ఆర్ ఆర్ ఆర్ స్దాయిలో క్రేజ్ తెచ్చుకున్న ప్రాజెక్టు ఏదైనా ఉంటే అది  'కేజీఎఫ్‌ 2' నే అని చెప్పాలి. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్  డైరక్షన్ లో యశ్ హీరోగా గతంలో రూపొందిన కేజీఎఫ్ సినిమా ఏ స్దాయిలో సంచలన విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. కేవలం కన్నడలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోను ఈ సినిమా వసూళ్లపరంగా కొత్త రికార్డులను సృష్టించింది. ఈ నేపధ్యంలో  ఈ సినిమా సీక్వెల్ కోసం దర్శకుడు - హీరో ఇద్దరూ కలిసి రంగంలోకి దూకారు. 

యాక్షన్ .. ఎమోషన్ పాళ్లు ఎంతమాత్రం తగ్గకుండా ఈ సీక్వెల్ ను మరింత భారీగా రూపొందించటానికి ప్లాన్ చేసారు. అయితే కరోనా వచ్చి దెబ్బ కొట్టింది. దాంతో షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. మొత్తానికి పూర్తి చేసారు. ఇప్పుడు రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి మొదట అనుకున్న ప్లాన్ ప్రకారం జూలై 16న రిలీజ్ అవ్వాలి. కానీ కరోనా సెకండ్ వేవ్ వచ్చి దెబ్బ కొట్టింది. దాంతో సరైన డేట్ కోసం ఎదురుచూస్తున్న వారికి తమ సెంటిమెంట్ డేట్ గుర్తు వచ్చింది. 

తాజాగా అందుతున్న సమాచారం మేరకు...ఈ సీక్వెల్ రిలీజ్ ని కేజీఎఫ్ మొదటి పార్ట్ రిలీజ్ రోజునే క్రిస్మస్ హాలీడేస్ లో రిలీజ్ చేద్దామనుకుంటున్నారట. అప్పుడు ఒకవేళ కరోనా థర్డ్ వేవ్ వచ్చినా వెళ్లిపోతుందని నమ్ముతున్నారు.  ఈ పాన్ ఇండియా చిత్రం ఫస్ట్ పార్ట్ ని మించి హై సక్సెస్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో విలన్ గా సంజయ్ దత్ నటిస్తుండటంతో ఈ ప్రాజెక్టు పై క్రేజ్ ఒక రేంజ్ లో పెరిగిపోయింది.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios