కన్నడ స్టార్ హీరో యష్ ‘కేజీఎఫ్’ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ అయ్యింది. ఈ ఒక్క సినిమాతో యష్ కు అన్ని భాషల్లో అభిమానులు పెరిగిపోయారు.మరోప్రక్క ఈ చిత్రం సీక్వెల్  ‘కేజీఎఫ్ 2’ సినిమా త్వరలో రాబోతుంది.  షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాకు ఓ రేంజిలో క్రేజడ్ ఉండటంతో ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్లు ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. తాజాగా ఈ సినిమా రన్ టైమ్ పై వచ్చిన ఓ వార్త మీడియాలో సెన్సేషన్ గా మారింది. 

ఏ విధమైన కట్స్ కాకుండా ఈ చిత్రం  మొత్తం రఫ్ రన్ టైం 2 గంటల 53 నిమిషాలు వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత మేర నిజముందో తెలియాల్సి ఉంది. అయితే అంతసేపు థియోటర్ లలో కూర్చుని ఈ సినిమా చూడగలరా అంటే చక్కని స్క్రీన్ ప్లే ఉంటే సాధ్యమే అంటున్నారు. ఇక ఈ భారీ చిత్రంలో అధీరాగా సంజయ్ దత్ నటించగా ప్రకాష్ రాజ్ మరియు రావు రమేష్ లు కీలక పాత్రల్లో నటించారు. అలాగే ఈ భారీ చిత్రాన్ని హోంబలే నిర్మాణ సంస్థ వారు తెరకెక్కించారు.

ఇక ఈ చిత్రం మేకర్స్ ఆ మధ్య అప్డేట్స్ ఇస్తూ క్రేజ్ క్రియేట్ చేయటానికి కేజీయఫ్ మ్యాగజైన్ లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. వాటి ద్వారా కొన్ని కీలక పాయింట్స్ ను ఇస్తూ పబ్లిసిటీ చేస్తున్నారు. జూలై 16న ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు దర్శక నిర్మాతలు. కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఒకే రోజు విడుదల కానున్న ఈ సినిమా దాదాపు రూ.300 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తోంది.

  కేజీఎఫ్: చాప్టర్ 2 మరోసారి కల్ట్ రాకీ పాత్రలో యష్‌ చేస్తున్నారు. సంజయ్ దత్ పోషించిన అధీరా రూపంలో అతను ఈసారి పెద్ద థ్రెట్ ఎదుర్కొ బోతున్నాడు. శ్రీనిధిశెట్టి, ప్రకాష్‌రాజ్‌, ఆనంత్‌నాగ్‌, రావు రమేష్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి  బ‌స్రూర్ సంగీతం అందిస్తున్నారు. అతి త్వరలోనే విడుదల తేదీకి సంబంధించి మేకర్స్ నుండి అఫీషియల్ ఎనౌన్సమెంట్  కోసం వేచి చూద్దాం.