విడుదల తేదీలో ఎలాంటి మార్పులు లేకపోవడంతో సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే అక్కడదాకా బాగానే ఉన్నా..ఈ సినిమా రిలీజ్ టైమ్ దగ్గర పడుతున్నా ఏ విధమైన ప్రమోషన్స్ లేకపోవటం షాక్ ఇస్తోంది.
కన్నడ స్టార్ యశ్ (Yash) ఇంతకు ముందు ఎవరో తెలియదు. కేజీఎఫ్ ఎప్పుడైతే వచ్చిందో అంతే... కోట్లాదిమంది సినీ లవర్స్ కు అభిమాన హీరో అయ్యిపోయారు. అంతేకాదు ఈ చిత్రం రెండో పార్ట్ కోసం వారంతా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పార్ట్ 2 గతేడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కరోనా కారణంగా అనేక సార్లు వాయిదా పడింది. ఈ క్రమంలోనే వేసవి కానుకగా ఈఏడాది ఏప్రిల్ 14న ‘కేజీఎఫ్-2’ (KGF 2)ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర టీమ్ గతేడాది ప్రకటించింది.
అయితే ఆ మధ్యన ‘కేజీఎఫ్-2’ (KGF 2) సరికొత్త పోస్టర్ విడుదల చేసింది. ‘‘గమనిక: ప్రమాదం ముందుంది’’ అని పేర్కొంటూ షేర్ చేసిన ఈ పోస్టర్‌లో ఏప్రిల్ 14నే చిత్రాన్ని విడుదల చేస్తామని మరోసారి అధికారికంగా ప్రకటించింది. విడుదల తేదీలో ఎలాంటి మార్పులు లేకపోవడంతో సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే అక్కడదాకా బాగానే ఉన్నా..ఈ సినిమా రిలీజ్ టైమ్ దగ్గర పడుతున్నా ఏ విధమైన ప్రమోషన్స్ లేకపోవటం షాక్ ఇస్తోంది.
ఈ సినిమా నుంచి ఒక్క పాటా విడుదల కాలేదు. అలాగే అకేషన్స్ ని పురస్కరించుకుని పోస్టర్స్, టీజర్స్ వదలటం లేదు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం రిలీజ్ డేట్ మారుతుందనే కంగారు పట్టుకుంది చాలా మంది ఫ్యాన్స్ కు. ఇప్పటికైనా నిర్మాతలు మేలుకుని కన్ఫూజన్ తొలిగించటానికి రిలీజ్ ప్లాన్స్ తో ముందుకు రావాలని కోరుకుంటున్నారు. రిలీజ్ డేట్ ని మరోసారి ఎనౌన్స్ చేయాలని కోరుకుంటున్నారు.
ఇక ‘కేజీఎఫ్’కు ప్రీక్వెల్‌గా ఈ సినిమా సిద్ధమైంది. ఈ చిత్రానికి ప్రశాంత్‌నీల్ (Prasanth Neel) దర్శకత్వం వహించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ (Sanjay Dutt) ఈ చిత్రంలో విలన్ గా కనిపించనున్నారు. ‘అధీరా’ పాత్రలో ఆయన ప్రేక్షకుల్ని అలరించనున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటి రవీనా టాండన్, టాలీవుడ్ నటుడు రావు రమేష్, ప్రకాశ్‌రాజ్ కీలకపాత్రలు పోషించారు.
