కన్నడ స్టార్ హీరో యష్ ‘కేజీఎఫ్’ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ అయ్యింది. ఈ ఒక్క సినిమాతో యష్ కు అన్ని భాషల్లో అభిమానులు పెరిగిపోయారు.మరోప్రక్క ఈ చిత్రం సీక్వెల్  ‘కేజీఎఫ్ 2’ సినిమా త్వరలో రాబోతుంది.  షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.  ఈ నెల 8న యష్ పుట్టిన రోజు సందర్భంగా కేజీఎఫ్ 2 టీజర్ ను విడుదల చేయనున్నారు.  దాంతో ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్లు ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

ఈ చిత్రం మేకర్స్ గత కొన్ని రోజుల నుంచి అప్డేట్స్ ఇస్తూ క్రేజ్ క్రియేట్ చేయటానికి కేజీయఫ్ మ్యాగజైన్ లు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. వాటి ద్వారా కొన్ని కీలక పాయింట్స్ ను ఇస్తూ పబ్లిసిటీ చేస్తున్నారు.

ఆ క్రమంలో తాజాగా విడుదల చేసిన మూడో మ్యాగజైన్ లో అధీరా ఎంత శక్తిమంతుడో వివరిస్తున్నారు. అలాగే అధీరా ఎలా బ్రతికాడు అన్న పాయింట్ ను కూడా హైలైట్ చేసి మరింత ఆసక్తి రాబట్టారు. గరుడపై కోపంతో అటాక్ చేయించినపుడు మిస్సవుతుంది. కానీ గరుడ అటాక్ చేసినపుడు మిస్ అవ్వదు. అయినా ఆ టైం లో అధీరా చావకుండా తప్పించుకుంటాడు అంటే అధీరాకు చావు లేదా? అనే క్వచ్చిన్స్ ని ఈ పబ్లిసిటీ పోస్టర్ లో వదిలారు.
 
మరో ప్రక్క ఈ సినిమా టీజర్ జ‌న‌వ‌రి 8న అంటే రేపు ఉద‌యం 10.18ని.ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్టు మేక‌ర్స్ కొద్దిసేప‌టి క్రితం ప్ర‌క‌టించారు.  టీజ‌ర్ కోసం భాషా భేధం లేకుండా దేశమంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తుంది. 

`కేజీఎఫ్`కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఇటీవలె క్లైమాక్స్ సన్నివేశాలను భారీగా షూట్ చేసారు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ పవర్‌ఫుల్ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 
  
 కేజీఎఫ్: చాప్టర్ 2 మరోసారి కల్ట్ రాకీ పాత్రలో యష్‌ చేస్తున్నారు. సంజయ్ దత్ పోషించిన అధీరా రూపంలో అతను ఈసారి పెద్ద థ్రెట్ ఎదుర్కొ బోతున్నాడు. శ్రీనిధిశెట్టి, ప్రకాష్‌రాజ్‌, ఆనంత్‌నాగ్‌, రావు రమేష్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి  బ‌స్రూర్ సంగీతం అందిస్తున్నారు. అతి త్వరలోనే విడుదల తేదీకి సంబంధించి మేకర్స్ నుండి అఫీషియల్ ఎనౌన్సమెంట్  కోసం వేచి చూద్దాం.