కన్నడ స్టార్ యష్, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషల్ లో వచ్చిన ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ తాజాగా మరో సెన్సేషనల్ రికార్డును క్రియేట్ చేసింది. 50 రోజులుగా ఈ యాక్షన్ ఫిల్మ్ థియేట్రికల్ రన్ రికార్డు స్థాయి థియేటర్లలో కొనసాగుతూనే ఉంది. 

కన్నడ హీరో యశ్ - డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన ''KGF: చాప్టర్ 2'' చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం.. భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 1200 కోట్ల మేర కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డులు సృష్టించింది. అటు బాలీవుడ్ రికార్డులను ఒక్కోక్కటిగా రాఖీబాయ్ చెరిపేశారు. వరల్డ్ వైడ్ హ్యయేస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిల్మ్ లో రెండో స్థానాన్ని దక్కించుకుంది. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డులను దాటేసి, బహుబలి రికార్డులను బ్రేక్ చేసేందుకు పరుగులు పెడుతోంది.

అయితే తాజాగా KGF Chapter 2 మరో సెన్సేషనల్ రికార్డును క్రియేట్ చేసింది. ఏప్రిల్ 14న రిలీజ్ అయిన ఈ చిత్రం థియేట్రికల్ రన్ ఇంకా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. ఈరోజుతో కేజీఎఫ్ 50వ రోజులోకి అడుగుపెట్టింది. భారీ సినిమాల నడుమా ఇంకా కేజీఎఫ్ థియేటర్స్ లో సందడి చేయడం గొప్ప విషయమనే చెప్పాలి. అదేవిధంగా సినిమా రిలీజ్ డేరోజు 4 వేలకు పైగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 390కి పైగా సెంటర్లలో ఆడుతోంది. అలాగే ఓవర్సీస్ లో పదికిపైగా సెంటర్స్ లో కేజీఎఫ్ హవా కొనసాగుతోంది. రెండు నెలలకు దగ్గరగా వస్తున్నా రికార్డు స్థాయి థియేటర్లలో కేజీఎఫ్ 2 ఆడటం విశేషం. మరోవైపు ఇండియన్ బాక్సాఫీసు వద్ద కేజీఎఫ్ కాసుల వర్షం కురిపిస్తూనే ఉంది.

కేజీఎఫ్ ఛాప్టర్ 2 ఎండింగ్ లో ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్3’ కూడా ఉండనున్నట్టు హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘సలార్’ చిత్రీకరణలో ప్రశాంత్ నీల్ బిజీగా ఉన్నారు. ఈ చిత్రం అనంతరం ‘కేజీఎఫ్3’ని తెరకెక్కించనున్నారు. చాఫ్టర్ లో హీరోహీరోయిన్లుగా యష్, శ్రీనిధి శెట్టి (SriNidhi Shetty) నటించారు. బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్ మరియు రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీలో రావు రమేష్, ప్రకాష్ రాజ్ లు కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. 

Scroll to load tweet…