కేజీఎఫ్ ఛాప్టర్ 2 నుంచి మ్యూజిక్ ట్రాక్ షురూ అయింది. ఏప్రిల్ 14న రిలీజ్ కానున్న ఈ భారీ చిత్రం కోసం ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. తాజాగా ఛాప్టర్ 2 నుంచి మేకర్స్ ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.
మోస్ట్ అవైటెడ్ మూవీల్లో కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘కేజీఎఫ్ ఛాపర్ట్ 2’(KGF Chapter 2) కోసం దేశమంతా ఎదురుచూస్తోంది. గతకొద్ది రోజులుగా ఈ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్స్ అందకపోవడంతో ఆడియెన్స్ కొంత అసంత్రుప్తి వ్యక్తం చేశారు. ఇది గమనించిన మేకర్స్ కొద్ది రోజుల నుంచి అప్డేట్స్ అందిస్తున్నారు. ఫస్ట్ సింగిల్, ట్రైలర్స్ పై అందించిన అప్డేట్స్ మేరకు తాజాగా ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ ‘తుఫాన్’(Toofan) లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.
కేజీఎఫ్ చాప్టర్ 1 (KGF 1)తో ఆల్ ఇండియా రేంజ్ లో యష్ (Yash) తన పాపులారిటీ సాధించుకున్నాడు. ఇందుకు ముఖ్యంగా రాఖీ బాయ్ మేనరిజం కాగా.. మరోవైపు ‘సలామ్ రాఖీ బాయ్, ధీరా ధీరా ధీరా’ సాంగ్స్ అని కూడా చెప్పాలి. ఈ మూవీకి ఇంతపెద్దన హైప్ తీసుకురావడంలో కేజీఎఫ్ ఛాప్టర్ 1 మ్యూజిక్ ట్రాక్స్ కూడా కీలక పాత్ర పోషించాయని చెప్పొచ్చు. కేజీఎఫ్ రిలీజ్ అయ్యి మూడేళ్లు పైనే అవుతున్నా ఇంకా ఆ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు అంటే సినిమా ఆడియన్స్ ను ఎంతలా మెస్మరైజ్ చేసిందో అర్ధం చేసుకోవచ్చు.
ఇక కేజీఎఫ్ ఛాప్టర్ 2 కోసం మూడేండ్లుగా అభిమానులు, సినీ ప్రేమికులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ మేరకు మేకర్స్ తాజాగా రిలీజ్ చేసిన కేజీఎఫ్ 2 ఫస్ట్ సింగిల్ ‘తుఫాన్’ లిరికల్ వీడియో సాంగ్, విజువల్స్ సినిమాపై మరింత హైప్ పెంచుతోంది. వీడియోలో రాఖీ భాయ్ గోల్డ్ మైనింగ్ ఏరియాను ఆక్రమించుకొని.. తన కంట్రోల్ లోకి తెచ్చుకుంటాడు. అక్కడ ఉన్న బానిసలకు భరోసానిస్తూ అండగా నిల్చుంటాడు. వారితో కలిసి గోల్డ్ మైన్ ను రన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, గోల్డ్ మైన్ ను తను స్వాధీనం చేసుకొని, అక్కడి బాధితులకు ధైర్యాన్నిచ్చిన సందర్భంగా ఈ సాంగ్ ప్లై అవుతున్నట్టు తెలుస్తోంది.
వీడియో సాంగ్.. జల్లెడ పడితే ఒక్కడూ మిగలడు.. ఇలాంటి జనాలతో వాడొక్కడు ఏం చేస్తాడు.. అవును మాకు ధైర్యం, నమ్మకం ఉండేది కాదు.. కానీ ఒక్కడు అడ్డుగా నిల్చున్నాడు.. వాడే నారాచిలోని ప్రతి ఒక్కరికీ ఊపిరినిచ్చాడు.. మీకో సలహా ఇస్తాను.. మీరు అతని అడ్డు నిల్చోకండి సార్’ అంటూ లిరిక్స్ స్టార్ట్ అవ్వడానికి మందే వచ్చే వాయిస్ ఓవర్ సాంగ్ ను హైప్ కు తీసుకెళ్తోంది. కొద్ది సేపటి కిందనే రిలీజ్ అయిన ఈ లిరికల్ వీడియో సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది.
కరోనా వల్ల డిలే అవుతూ వస్తున్న కేజీఎఫ్ 2ను ఫైనల్ గా ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తాయనున్నాను. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా రిలీజ్ అయిన ‘తుఫాన్’ లిరికల్ సాంగ్ కూడా ఛాప్టర్ 2పై మరింత ఆసక్తిని పెంచింది. ఇక మార్చి 27న సాయంత్రం 6 గంటలకు ట్రైలర్ కూడా రానున్నంది.
