బాక్సాఫీసు వధ్ద కలెక్షన్స్ అత్యధిక కలెక్షన్స్ సాధిస్తూ దూసుకుపోయింది. బాలీవుడ్ చరిత్రలో ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్స్ సాధించిన రెండో చిత్రంగా ('బాహుబలి 2' తర్వాత) 'కేజీఎఫ్ ఛాప్టర్ 2' మూవీ నిలిచింది.   


కన్నడ స్టార్ హీరో యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'కేజీఎఫ్'. ఈ సిరీస్ లోని తొలి భాగాన్ని 2018లో విడుదల చేయగా.. ఇప్పుడా సినిమాకు రూపొందిన సీక్వెల్ 'కేజీఎఫ్ 2' ఇటీవలే రిలీజయ్యి ఘనవిజయం సాధించింది. బాక్సాఫీసు వధ్ద కలెక్షన్స్ అత్యధిక కలెక్షన్స్ సాధిస్తూ దూసుకుపోయింది. బాలీవుడ్ చరిత్రలో ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్స్ సాధించిన రెండో చిత్రంగా ('బాహుబలి 2' తర్వాత) 'కేజీఎఫ్ ఛాప్టర్ 2' మూవీ నిలిచింది.

 ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న 'కేజీఎఫ్ 2' కలెక్షన్స్ లో మరో మైలురాయిని చేరుకుంది. క్లోజింగ్ కలెక్షన్స్ కలెక్షన్స్ లో రూ. 1,200 కోట్ల మైలురాయి చేరుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూడో భారతీయ చిత్రంగా 'కేజీఎఫ్ 2' సరికొత్త రికార్డును సృష్టించింది. 'కేజీఎఫ్ ఛాప్టర్ 2' తొలి వారంలో రూ. 720.31 కోట్లు సాధించగా.. రెండో వారం రూ. 223.51 కోట్లు.. రెండు వారాల్లోనే రూ. 1,000 కోట్ల కలెక్షన్స్ మార్క్ ను చేరుకుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రూ. 1198.20 కోట్లకు పైగా వసూళ్లను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

ఏరియావైజ్ వివరాల్లోకి వెళితే...

ఆంధ్రా/ తెలంగాణా - Rs. 150 crores
కర్ణాటక- Rs. 171.50 crores
తమిళనాడు- Rs. 109.70 crores
కేరళ - Rs. 66.10 crores
నార్త్ ఇండియా - Rs. 494.30 crores
ఇండియా మొత్తం- Rs. 991.60 crores
ఓవర్ సీస్ -$27.05 million / Rs. 206.60 crores
 ప్రపంచ వ్యాప్తంగా - Rs. 1198.20 crores


పాన్-ఇండియా స్థాయిలో బ్లాక్‌బస్టర్ గా నిలిచిన 'KGF చాప్టర్ 2' మూవీ ఇప్పుడు ఓటీటీలో కూడా అందుబాటులో ఉంది. ఈ చిత్రం హిందీలో రికార్డులు సృష్టించింది. కేజీఎఫ్ 2 తర్వాత అజయ్ దేవగన్ 'రన్‌వే 34', టైగర్ ష్రాఫ్ 'హీరోపంతి 2', రణవీర్ సింగ్ 'జయేష్‌భాయ్ జోర్దార్', కార్తీక్ ఆర్యన్ 'భూల్ భూలయ్యా 2' వంటి పెద్ద పెద్ద సినిమాలు విడుదల అయ్యాయి. అయితే అవేమి కేజీఎఫ్ 2 వసూళ్లపై ఎలాంటి ప్రభావం చూపలేదు.

'కేజీఎఫ్ చాప్టర్ 2' సినిమాలో రాకీ భాయ్ య‌శ్‌ సరసన శ్రీనిధి శెట్టి నటించారు. సంజయ్ దత్ విలన్ అధీర పాత్రలో నటించి ఔరా అనిపించాడు. రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి, ప్రకాష్ రాజ్ నటన సినిమాకు బాగా ప్లస్ అయ్యారు. త్వరలో చాప్టర్ 3 షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.