కన్నడలో తెరకెక్కిన KGF సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా వివిధ భాషల్లో అనువాదమైన ఒక కన్నడ మూవీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ లో సరికొత్త రికార్డులు నమోదు చేసింది. ఇక ఆ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ సిద్దమవుతున్న విషయం తెలిసిందే. 

అయితే రీసెంట్ గా KGF 2 సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో గల సైనైడ్ హిల్స్ ప్రాంతంలో షూటింగ్ వల్ల పర్యావరణానికి హాని కలుగుతోందని దాఖలైన పిటిషన్ కు అక్కడి న్యాయస్థానం షూటింగ్ ని ఆపివేయాల్సిందిగా తీర్పునిచ్చింది. దీంతో షూటింగ్ లొకేషన్ ని మార్చాలని చిత్ర యూనిట్ షెడ్యూల్ ని  హైదరాబాద్ కి షిఫ్ట్ చేస్తున్నట్లు సమాచారం. 

కొన్ని రోజుల పాటు ఇక్కడ ప్రత్యేక సెట్ లో సినిమా షూటింగ్ ని నిర్వహించి కోల్ కతా ముంబై వంటి నగరాల్లో కూడా పలు కీలక సన్నివేశాలను షూట్ చేయాలనీ దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. ఇక సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ కీలకపాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే.