బాహుబలి తరువాత ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని ఓ రేంజ్ లో కుదిపేసిన చిత్రం KGF.  సౌత్ నుంచి ఒక కన్నడ చిత్రం ఇతర భాషల్లో కూడా భారీ స్థాయిలో కలెక్షన్స్ ను సాధించడం ఇదే మొదటిసారి. గతంలో ఎప్పుడు లేని విధంగా కథానాయకుడు యష్ నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 

ఇకపోతే KGF సెకండ్ పార్ట్ షూటింగ్ కోసం చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఏప్రిల్ రేబీదవా వారంలో ఈ రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టి సినిమాను వీలైనంత త్వరగా ఫినిష్ చెయ్యాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రయత్నాలు చేస్తున్నాడు. సినిమా నార్త్ లో కూడా భారీ విజయాన్ని సాధించడంతో బాలీవుడ్ స్టార్ నటీనటులను సినిమాలో కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ముఖ్యంగా సినిమాలో ప్రధాన విలన్ గా సంజయ్ దత్ నటించే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. ఈ విషయంపై ఇంకా చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక KGF 2ను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.