ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి బిగ్ ఫ్యాన్ అంటుంది సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్. పుష్ప రాజ్ అంటే ఎంతో ఇష్టం అంటున్న రవీనా కామెంట్స్ వైరల్ గా మారాయి.
లేటెస్ట్ సెన్సేషన్ కెజిఫ్ చాప్టర్ 2 బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. యష్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సీక్వెల్ ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేస్తుంది. సౌత్ నార్త్ అనే తేడా లేకుండా వసూళ్ల వర్షం కురిపిస్తుంది. హిందీలో కెజిఎఫ్ 2 ఆర్ ఆర్ ఆర్ రికార్డు బ్రేక్ చేసింది. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను కెజిఎఫ్ చాఫ్టర్ 2(KGF Chapter 2) ఊపేస్తోంది. చిత్ర ప్రముఖులు సైతం ఈ మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
తాజాగా అల్లు అర్జున్ (Allu Arjun) ఈ మూవీని ఉద్దేశిస్తూ వరుస ట్వీట్స్ వేశారు. కెజిఎఫ్ 2 టీం ని ఆయన పొగడ్తలతో ముంచెత్తారు. హీరో యష్,హీరోయిన్ శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్, రవీనా టాండన్ లతో పాటు మిగతా నటులు అద్భుతమైన నటన కనబరిచినట్లు తన ట్వీట్ లో పొందుపరిచారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ని ప్రత్యేకంగా అల్లు అర్జున్ ప్రత్యేకంగా పొగిడారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ స్పందించారు. అల్లు అర్జున్ కి ధన్యవాదాలు తెలిపారు.
కాగా నటి రవీనా టాండన్ (Ravina Tandon)అల్లు అర్జున్ ప్రశంసలకు కృతజ్ఞతలు తెలిపారు. అల్లు అర్జున్ కి బిగ్ ఫ్యాన్ అన్న రవీనా టాండన్, పుష్ప మూవీ ఎంతగానో నచ్చినట్లు తన ట్వీట్ లో వెల్లడించారు. అలాగే అలాంటి గొప్ప చిత్రాలు మరిన్ని చేయాలని కోరుకున్నారు. రవీనా టాండన్ అల్లు అర్జున్ ట్వీట్ కి స్పందించిన తీరు చూస్తుంటే ఆయన క్రేజ్ అర్థమవుతుంది. పుష్ప మూవీతో అల్లు అర్జున్ బాలీవుడ్ లో ఫస్ట్ హిట్ సాధించిన విషయం తెలిసిందే.
ఇక కెజిఎఫ్ ప్రధాన పాత్రల్లో ఒక్కటైన రమికా సేన్ పాత్రను రవీనా టాండన్ చేశారు. ఆమె రాకీ భాయ్ పై యుద్ధం ప్రకటించే భారత ప్రధానిగా కనిపించారు. ఈ మూవీ రవీనా టాండన్ కు చాలా కాలం తర్వాత మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ప్రేక్షకులు ఆమె పాత్ర గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు.
