పుష్ప మూవీతో అల్లు అర్జున్ అనుకున్నది సాధించారు. నార్త్ ఇండియాలో మొదటి హిట్ కొట్టి పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ కి దగ్గరయ్యాడు. అయితే ఆయన టార్గెట్ ఇంకా పూర్తి కాలేదు. పుష్ప 2తో దాన్ని చేరుకోవాలనే ఆలోచన చేస్తున్నాడట.
దర్శకుడు సుకుమార్-బన్నీ(Allu Arjun) కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప ది రైజ్. ఏమంత అంచనాలు లేకుండా విడుదలైన పుష్ప భారీ విజయం నమోదు చేసింది. ముఖ్యంగా హిందీ, మలయాళ భాషల్లో సత్తా చాటింది. తెలుగు స్టేట్స్ లో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్న పుష్ప... కొంత మేర నష్టాలు మిగిల్చింది. మొత్తంగా పుష్ప రూ. 350 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. హిందీలో వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం అనూహ్య పరిణామం. పుష్ప చిత్రానికి బాలీవుడ్ లో పెద్దగా ప్రమోషన్స్ నిర్వహించలేదు. దీంతో పూర్ ఓపెనింగ్స్ దక్కాయి. మొదటి రోజు కేవలం రూ. 3 కోట్ల గ్రాస్ అందుకుంది.
అయితే పుష్ప (Pushpa) పాజిటివ్ టాక్ తో లాంగ్ రన్ నడిచింది. ఏకంగా నాలుగు వారాలు నిరవధికంగా కలెక్షన్లు రాబట్టిన పుష్ప రూ. 100 కోట్ల మార్క్ క్రాస్ చేసింది. పుష్ప ఓపెనింగ్స్ చూసిన ఎవరైనా ఆ స్థాయి వసూళ్లకు చేరుకుందంటే నమ్మరు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. పుష్ప సాంగ్స్, హీరో అల్లు అర్జున్ మేనరిజం నార్త్ లో ఫేమస్ కావడం విశేషం. పుష్ప సక్సెస్ నేపథ్యంలో పుష్ప ది రూల్ భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. కెజిఎఫ్ 2 (KGF 2) సక్సెస్ ని దృష్టిలో పెట్టుకొని వెయ్యి కోట్లు టార్గెట్ పెట్టుకున్నారట.
కెజిఎఫ్ ఫస్ట్ పార్ట్ హిందీలో కేవలం రూ. 45 కోట్ల వసూళ్లు మాత్రమే సాధించింది. సెకండ్ పార్ట్ ఏకంగా రూ. 400 కోట్లు దాటేసింది. సుమారు పది రెట్లు ఎక్కువ వసూళ్లు పార్ట్ 2 సాధించింది. ఇప్పుడు పుష్ప 2 మేకర్స్ కూడా ఇదే టార్గెట్ పెట్టుకున్నారట. ప్రేక్షకుల అంచలనాలకు ఏమాత్రం తగ్గకుండా పుష్ప 2 భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలని, హిందీలో రికార్డు వసూళ్లు చేజిక్కించుకోవాలని అనుకున్నారట. వరల్డ్ వైడ్ గా పుష్ప 2 (Pushpa 2)వేయి కోట్ల టార్గెట్ తో విడుదల కానుందట.
అందుకే పుష్ప 2 విడుదల కూడా ఆలస్యం కానుందట. నిజానికి పుష్ప 2 మార్చి లో షూటింగ్ స్టార్ట్ చేసి, డిసెంబర్ లో విడుదల చేయాలని భావించారు. మేకర్స్ లో మారిన ఆలోచనల రీత్యా ఇంకా ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళలేదు. భారీ వసూళ్లు టార్గెట్ పెట్టుకున్న నేపథ్యంలో పుష్ప 2 మరింత ఆలస్యం కానుందట. అలాగే క్యాస్ట్ విషయంలో కూడా నార్త్ ఇండియా యాక్టర్స్ ని తీసుకునేలా ప్లాన్ చేస్తున్నారట. మరి పుష్ప 2 తో అల్లు అర్జున్ వేయి కోట్ల వసూళ్ల ఆలోచన ఎంత వరకు సాధిస్తాడో చూడాలి.
