హైదరాబాద్‌కు వచ్చిన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్‌ను ఆయన నివాసంలో కలిశారు. ఎన్టీఆర్ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి నీల్ హైదరాబాద్ వచ్చాడు.  


కన్నడ స్టార్ హీరో యశ్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం కేజీఎఫ్ 2. గతంలో కేజీఎఫ్ మూవీతో సెన్సెషన్ క్రియేట్ చేశారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ చిత్రానికి సిక్వెల్‏గా తెరకెక్కించిన సినిమానే కేజీఎఫ్ 2. ఈ సినిమా సూపర్ హిట్టై...ఈ దర్శకుడు నెక్ట్స్ ప్రాజెక్టుపై మరిన్ని అంచనాలను పెంచేసింది. ముఖ్యంగా ఇందులో యశ్ చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో హీరో యశ్ చెప్పిన డైలాగ్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తో ఈ దర్శకుడు కమిటవ్వటంతో ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

KGF2 సక్సెస్ తర్వాత, ప్రశాంత్ నీల్ దేశంలో మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్ అయ్యాడనటంలో సందేహం లేదు. నీల్‌తో సినిమా చేయాలని పెద్ద స్టార్లు ఉత్సాహపడుతున్నారు కానీ ఎన్టీఆర్, ప్రభాస్ మాత్రం నీల్‌తో ప్రాజెక్ట్‌లు సెట్ చేసుకున్నారు.ఇదిలా ఉంటే నిన్న హైదరాబాద్‌కు వచ్చిన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్‌ను ఆయన నివాసంలో కలిశారు. ఎన్టీఆర్ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి నీల్ హైదరాబాద్ వచ్చాడు. ఇంకా విశేషమేమిటంటే ఎన్టీఆర్‌తో పాటు నీల్ మరియు అతని భార్య కూడా అదే వివాహ వార్షికోత్సవంలో షేర్ చేసుకున్నారు.

Scroll to load tweet…

 ఎన్టీఆర్ జంటలు కలిసి ఉన్న ఫొటోని పోస్ట్ చేసి, కొత్త ఆరంభాలకు చీర్స్ చెప్పారు, ఈ ఫొటోని చూసిన అభిమానులు ఎన్టీఆర్ చిత్రం అద్బుతంగా వస్తుందని చాలా సంతోషిస్తున్నారు. ప్ర‌స్తుతం నీల్ ప్ర‌భాస్‌తో స‌లార్ సినిమా షూటింగ్ కోసం స‌న్నాహాలు చేస్తున్నాడు. అతను ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత, అతను ఎన్టీఆర్ నెక్ట్స్ చిత్రాన్ని ప్రారంభిస్తారు.

ఇక ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేస్తే వైరల్ అయ్యింది. తాను గత 15 నుంచి 20 ఏళ్లుగా జూనియర్ ఎన్టీఆర్ కు అభిమాని అని తెలిపారు. అంతేకాకుండా.. ప్రస్తుతం తాము మంచి సన్నిహితులమయ్యామని.. ఇటీవల తారక్ కు చెప్పిన స్టోరీ తనకు నచ్చిందని.. దీంతో వెంటనే తాను ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. 

స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశాక ఇప్పటికీ 10-15 సార్లు కలిశామని.. తారక్ కు స్క్రిప్ట్ నచ్చడంతో దానిపై పూర్తిగా వర్క్ చేస్తున్నానని.. ఈ సినిమా గురించి చాలా ఉత్సాహంగా ఉన్నా్మని.. కానీ అది ఏ జోనర్ అని మాత్రం అడగొద్దంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. మరోవైపు తారక్ ఆర్ఆర్ఆర్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. త్వరలో తారక్ ...మరో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నాడు.