`బ్రో` సినిమా ఒప్పుకోవడానికి కారణం బయటపెట్టింది కేతిక శర్మ. ఆ ఒక్క రీజన్‌తోనే సినిమా చేయడానికి ఒప్పుకుందట. మరి ఆ కారణం ఏంటి? తన పాత్రేంటి? అనే విషయాలను కూడా వెల్లడించిందీ హాట్ బ్యూటీ.
హాట్ హాట్ అందాలతో మంత్రముగ్దుల్ని చేసే కేతిక శర్మ.. పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే అవకాశం దక్కించుకోవడం విశేషంగా చెప్పొచ్చు. `బ్రో` మూవీలో ఆమె సాయిధరమ్ తేజ్‌కి జోడీగా నటించింది. అయితే ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం బయటపెట్టింది కేతిక శర్మ. ఆ ఒక్క రీజన్‌తోనే సినిమా చేయడానికి ఒప్పుకుందట. మరి ఆ కారణం ఏంటి? తన పాత్రేంటి? అనే విషయాలను కూడా వెల్లడించిందీ హాట్ బ్యూటీ. `బ్రో` సినిమా ఈ నెల 28న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా సోమవారం మీడియాతో ఈ విషయాన్ని తెలిపింది కేతిక.
ఆమె మాట్లాడుతూ `బ్రో` సినిమా ఒప్పుకోవడానికి ఒకే ఒక్క కారణం పవన్ కళ్యాణ్ అని తెలిపింది. ఆయన సినిమా అని చెప్పగానే మరో ఆలోచన లేకుండా ఒప్పేసుకున్నట్టు తెలిపింది. పవన్ కళ్యాణ్ అనే పేరు వింటే చాలు, ఒప్పుకోవడానికి పెద్దగా కారణాలు అవసరం లేదని తెలిపింది. అయితే పవన్‌తో కాంబినేషన్ సీన్లు లేవట. స్క్రీన్ స్పేస్‌లో తాను ఉన్ననని, కానీ ఆయనతో డైరెక్ట్ కాంబో సీన్ లేదని తెలిపింది. కానీ ఆయన సినిమాలో నటించే అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉందని తెలిపింది.
పవన్‌ని డైరెక్ట్ గా కలవాలంటే భయమేసిందట. `పవన్ కళ్యాణ్ తో నేరుగా వెళ్లి మాట్లాడాలంటే కాస్త భయమేసింది. సాయి ధరమ్ తేజ్ చెప్తే నన్ను తీసుకెళ్లి ఆయనకు పరిచయం చేశారు. కాంబినేషన్ సీన్స్ లేకపోవడం వల్ల పవన్ కళ్యాణ్ ని ఎక్కువ కలవలేకపోయాను. కానీ ఆరోజు ఆయనతో మాట్లాడిన ఆ ఐదు నిమిషాలు మాత్రం మంచి అనుభూతిని ఇచ్చింది` అని తెలిపింది కేతిక. `ఈ సినిమాలో నేను సాయి ధరమ్ తేజ్ పోషిస్తున్న మార్క్ కి ప్రేయసిగా కనిపిస్తాను. ఇది సినిమాకి ముఖ్యమైన, నటనకు ఆస్కారం ఉన్న పాత్ర. సినిమాలోని ప్రతి పాత్ర కథని ముందుకు నడిపించేలా ఉంటుంది. అనవసరమైన పాత్రలు గానీ, సన్నివేశాలు గానీ లేకుండా ఆసక్తికర కథాకథనాలతో ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమా సాగుతుంది. ఇదొక సందేశాత్మక చిత్రం. ఈ తరహా సినిమాలో నటించే అవకాశం రావడం నాకు ఇదే మొదటిసారి. నా గత చిత్రాలతో పోలిస్తే ఇది విభిన్న చిత్రం. నటిగా మరింత మెరుగుపడటానికి సహాయపడింది` అని తెలిపింది కేతిక.
`బ్రో`.. తమిళంలో హిట్ అయిన `వినోదయ సీతం` చిత్రానికి రీమేక్ అయిన నేపథ్యంలో దీనిపై ఆమె స్పందిస్తూ, `మాతృకతో పోలిస్తే ఇందులో నా పాత్రకు ప్రాధాన్యం ఎక్కువ. ఫన్నీ డైలాగ్స్ ఉంటాయి. స్క్రిప్ట్ చక్కగా కుదిరింది. దానికి తగ్గట్టుగా నటిగా నా ఉత్తమ ప్రదర్శనను ఇవ్వడానికి కృషి చేశాను. సముద్రఖని ఫాస్ట్ డైరెక్టర్. ఆయన ఎక్కువ టేక్స్ తీసుకోరు. తక్కువ టేక్స్ లోనే మన నుంచి బెస్ట్ అవుట్ పుట్ రాబడతారు. ఆయనకు ఏం కావాలో ఆయనకు స్పష్టంగా తెలుసు. ఆయన చాలా తెలివైన దర్శకులు. త్రివిక్రమ్ గారి అద్భుతమైన రచన కూడా ఈ సినిమాకి తోడైంది. సినిమా ఇంకా బాగా వచ్చింది` అని చెప్పింది.
నెక్ట్స్ ప్రాజెక్ట్, డ్రీమ్ రోల్స్ గురించి చెబుతూ, `ఆహా స్టూడియోస్‌లో ఓసినిమా చేస్తున్నా. స్పోర్ట్స్ నేపథ్యంలో బయోపిక్ చేయాలనేది తన డ్రీమ్ రోల్ అని చెప్పింది. ముఖ్యంగా తాను స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొన్నానని, అలాంటి బయోపిక్‌లను ఇష్టపడతా అని చెప్పింది కేతిక. పవన్, సాయి తేజ్ హీరోలుగా కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియన్ హీరోయిన్లుగా సముద్రఖని రూపొందించిన `బ్రో` సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు.
