ప్రముఖ దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి సినీ కార్మికుల భూ వివాదంపై ఉద్యమిస్తున్నారు. బుధవారం రోజు కేతిరెడ్డి ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ చిత్రపురి కాలనీ అవినీతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను, మరికొందరు ప్రముఖులు 1994లో ఎంతో కష్టపడి అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వం నుంచి సినీ కార్మికుల గృహ వసతి కోసం 67 ఎకరాల భూమిని మంజూరు చేయించామని తెలిపారు. 

కానీ ఆ భూమి సినీ కార్మికులకు దక్కకుండా కమిటీ సభ్యులు అవినీతితో ప్రయివేట్ వ్యక్తులకు ధారపోస్తున్నారని కేతిరెడ్డి మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వర రావుపై కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పరుచూరి వెంకటేశ్వరరావు భూముల కమిటీ ట్రెజరర్ గా అవినీతితో సంతకాలు చేసిన సంగతి వాస్తవం కాదా అని కేతిరెడ్డి ప్రశ్నించారు. 

ఇది చాలా పెద్ద కుంభకోణం.. దాదాపు 2300 మంది ప్రైవేట్ వ్యక్తులకు 1000 కోట్ల అవినీతితో ఈ భూములు కేటాయించారని కేతిరెడ్డి ఆరోపిస్తున్నారు. ఆగ్రహంగా మాట్లాడుతూ కమిటీ సభ్యులంతా వెంటనే రాజీనామా చేసి వైదొలగాలని కేతిరెడ్డి డిమాండ్ చేశారు. 

దీనిపై ఇప్పటివరకు ఎన్ని విచారణలు జరిపినా అసలైన దోషులని మాత్రం ఇంతవరకు ప్రశ్నించలేదు. దీనిని బట్టి ఈ భూవివాదం వెనుక కొంతమంది పెద్దమనుషులు ఉన్నారని కేతిరెడ్డి ఆరోపించారు. 

"