వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఏపీలో విడుదల కాకుండా చేశారు. వర్మ మొట్టమొదటి అపజయానికి కారణం లక్ష్మీపార్వతేనని అంటున్నాడు దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. 

ఎన్ని వివాదాలు ఎదురైనా 'రక్తచరిత్ర', 'వంగవీటి' వంటి సినిమాలను అనుకున్న సమయానికి వర్మ రిలీజ్ చేసుకోగలిగాడని, కానీ ఆయన డైరెక్ట్ చేసిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మాత్రం రిలీజ్ చేసుకోలేకపోయాడని.. దానికి కారణం లక్ష్మీపార్వతి ఐరన్ లెగ్ అని అంటున్నాడు.

ఆమె కారణంగానే ఇప్పుడు ఆర్జీవీ అబాసుపాలయ్యారని చెబుతున్నాడు. ఇలా జరుగుతుందని ఆర్జీవీ కూడా ఊహించి ఉండడని అన్నారు. లక్ష్మీపార్వతి ఎక్కడ కాలు మోపితే అక్కడ అంతా సర్వనాశనం అవుతుందని.. ఆమె లెగ్ మహిమ అలాంటిదని విమర్శించారు. లక్ష్మీపార్వతి జీవితంలో సాధించిందేమీ లేదని.. అందరినీ ముంచేసే మహిళ అంటూ సంచలన కామెంట్స్ చేశారు.

తన కెరీర్ లో ఎక్కడా బ్రేక్ లేని ఆర్జీవీ సినీ జీవితంలో మొదటిసారి లక్ష్మీపార్వతి లెగ్ పడడంతో మొత్తం సీన్ రివర్స్ అయిందని అంటున్నారు. ఆర్జీవీ ఇకనైనా తెలుసుకో.. అంటూ సలహా ఇస్తున్నారు.