బాలీవుడ్ లో అమిర్ ఖాన్ -షారుక్ ఖాన్ - సల్మాన్ ఖాన్ వంటి స్టార్స్ తరువాత డిఫరెంట్ సినిమాలతో సక్సెస్ అందుకునే అక్షయ్ కుమార్ కేసరితో ఎదో కొత్త వండర్ క్రియేట్ చేసేలా ఉన్నాడనిపిస్తోంది. వీకెండ్ అనంతరం కూడా మినిమమ్ కలెక్షన్స్ వస్తుండడంతో సినిమాపై పరభాషా అభిమానుల్లో అంచనాలు పెరుగుతున్నాయి.ముఖ్యంగా తెలుగు ఆడియెన్స్ ని  సినిమా ఎక్కువగా ఆకర్షిస్తోంది.  

మొత్తంగా నిన్నటితో సినిమా కలెక్షన్స్ 86 కోట్లకు చేరుకున్నాయి. ఐపీఎల్ ప్రభావం కొంత చూపినా నెక్స్ట్ వీక్ వరకు ఒక లెవెల్లో కేసరి బాక్స్ ఆఫీస్ వద్ద నెంబర్ వన్ పొజిషన్ లో ఉండడం పక్కా. పైగా గత కొన్ని రోజులుగా బాలీవుడ్ లో కూడా ఏ సినిమాలు పెద్దగా హడావుడి చేయలేదు. కేసరి వచ్చి సమ్మర్ లో కొంత ఊపునిచ్చింది. 

సిక్కు సైనికుల పోరాడిన‘సారాగఢి’ యుద్ధ నేపథ్యంలో సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. కేవలం 21 మంచి సైనికులు 10 వేల మంది శత్రువులను  ఎదుర్కోవడం అనే కాన్సెప్ట్ సినిమాలో హైలెట్. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మించారు. ఇక మరో రెండు రోజుల్లో సినిమా 100 కోట్లను ఈజీగా దాటేస్తుందని చెప్పవచ్చు.