Asianet News TeluguAsianet News Telugu

ముగిసిన వివాదం, కాంతార టీమ్ కు కేరళ హైకోర్ట్ లో భారీ ఊరట.

కేరళ హైకోర్ట్ లో కాంతార మూవీ టీమ్  కు భారీ ఊరట లభించింది. ఈ సినిమాపై ఉన్న కాపీరైట్ వివాదం నుంచి బయట పడింది టీమ్. ఇంతకీ విషయం ఏంటంటే..? 

Kerala High Court Quashes Copyright Case of Kantara Movie Varaha Roopam Song  JMS
Author
First Published Nov 2, 2023, 2:37 PM IST

కన్నడ నాట నుంచి చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి.. ఆతువాత సంచలనంగా మారింది  కాంతార. ఒక లోకల్ లాంగ్వేజ్ ఫిల్మ్..  పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ముందుగా కన్నడ భాషలో విడుదలైన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఆతర్వాత ఇతర భాషల్లోకి రిలీజ్ అయ్యింది. విడుదలైన అన్ని భాషల్లో కాంతార అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ గా నిలవడంతో పాటు.. మంచి కలెక్షన్లు కూడా కొల్ల గొట్టింది. అయితే పాన్ ఇండియా రేంజ్ ల్ హిట్ అయిన ఈ సినిమా..  ఓ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. కాంతార సినిమాలో వరహా రూపం సినిమా పై అప్పట్లో వివాదం రేగింది.  ఈ వివాదానికి తాజాగా పుల్ స్టాప్ పడింది. 

కాంతార సినిమాలో వరాహ రూపం పాట పై కాపీరైట్ ఇష్యు వచ్చింది.  వరాహ రూపం పాట ఒరిజినల్ ట్యూన్ మాది అని తైక్కుడం బ్రిడ్జ్‌లోని నవసరం పాటకు కాపీ అని పాట హక్కులను కలిగి ఉన్న మాతృభూమి పబ్లిషర్స్ దావా వేశారు.దాంతో ముందు చర్యగా..  దిగువ కోర్టులో విచారణ జరిపి వరాహ రూపం పాటను ఓటీటీ కాకుండా థియేటర్లలో లేదా డిజిటల్ మీడియాలో ఉపయోగించరాదని ఆదేశించింది. ఈ కేసు కేరళ హైకోర్టుకు చేరడంతో కాంతార మూవీ టీమ్ కు అప్పుడు ఊరట లభించింది. 

అయితే ఈ వివాదంపై  చాలా కాలంగా వాదనలునడుస్తుండగా.. కాంతార టీమ్.. మాతృభూవి పబ్లిషనర్స్ మధ్య ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. కాంతార మూవీ తరుపు వాదిస్తున్న లాయర్  విజయ్‌ వి పాల్‌.. కాంతార చిత్ర బృందం, మాతృభూమి పబ్లిషర్స్‌ మధ్య జరిగిన చర్చల అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లి క్రిమినల్‌ ప్రొసీడింగ్‌ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేరళ హైకోర్టు ఈ పిటిషన్‌ను అంగీకరించింది అలాగే సెక్షన్ 482 CrPC కింద ప్రత్యేక అధికారాలను ఉపయోగించి కేసును రద్దు చేసింది. ఈ వివాదం రెండు సంస్థల మధ్య ప్రైవేట్ వివాదంగా కనిపిస్తోందని గతంలో ఇలాంటి కొన్ని కేసులను పేర్కొంటూ కేరళ హైకోర్టు కేసును రద్దు చేసింది.కాంతారావు’ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీత దర్శకత్వం వహించారు. హోంబలే ఫిల్మ్స్‌కు చెందిన విజయ్ కిర్గందూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వచ్చిన విషయం తెలిసిందే.


 

Follow Us:
Download App:
  • android
  • ios