VD18 : కీర్తి సురేష్ బాలీవుడ్ మూవీ టైటిల్ వచ్చేసింది.. గ్లింప్స్ చూశారా!
టాలీవుడ్ నటి కీర్తి సురేష్ Keerthy Suresh బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దంగా ఉంది. హిందీలోని తన తొలిచిత్రానికి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ తాజాగా విడుదలైంది.
‘మహానటి’ కీర్తి సురేష్ సౌత్ లో వరుస చిత్రాలతో అలరిస్తూనే ఉంది. హీరోయిన్ గా అదరగొడుతూనే.. మరోవైపు కీలక పాత్రలతోనూ ఆకట్టుకుంటోంది. టాలీవుడ్ లో చివరిగా మెగాస్టార్ చిరంజీవి చిత్రం ‘భోళా శంకర్’లో చిరుకు చెల్లెలి పాత్ర పోషించి ఆకట్టుకుంది. అంతకుముందు మహేశ్ బాబు సరసన ‘సర్కారు వారిపాట’తో సక్సెస్ అందుకుంది. దీంతో సౌత్ లో మరిన్ని ఆఫర్లు అందుకుంది. అలాగే బాలీవుడ్ లోనూ కీర్తికి సినిమా ఛాన్స్ దక్కింది.
బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ Varun Dhawan సరసన హిందీలో రాబోతున్న చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి మొన్నటి వరకు VD18అని వర్క్ టైటిల్ ఇచ్చారు. ఇక తాజాగా సినిమా టైటిల్ ను రివీల్ చేశారు. ఈ సందర్బంగా టైటిల్ గ్లింప్స్ ను విడుదల చేసింది యూనిట్.... అలాగే వరుణ్ ధావన్ ఫస్ట్ లుక్ ను కూడా రివీల్ చేశారు. ‘బేబీ జాన్’ Baby John అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. గ్లింప్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. వరుణ్ ధావన్ భయంకరమైన లుక్, పవర్ ఫుల్ బీజీఎం సినిమాపై ఆసక్తిని కలిగించేలా ఉన్నాయి.
‘బేబీ జాన్’ చిత్రాన్ని తమిళ స్టార్ డైరెక్టర్ ‘అట్లీ’ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ను కలీస్ డైరెక్ట్ చేస్తున్నారు. జియో స్టూడియోస్, యాపిల్ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ ప్రాజెక్ట్ ను మే 31న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండటం విశేషం. ఈ సినిమాతో కీర్తి సురేష్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటికే పలు హీరోయిన్లు బాలీవుడ్ లో తమ లక్ ను పరీక్షించుకున్నారు. ఇక ఇప్పుడు కీర్తి సురేష్ ఎలాంటి ఫలితాన్ని అందుకోబోతుందనేది చూడాలి.