Asianet News TeluguAsianet News Telugu

‘పాజిటివిటీ కోసం వాడండి’.. డీప్ ఫేక్ వీడియోపై ఘాటుగా స్పందించిన కీర్తి సురేష్

రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియోపై టాలీవుడ్ తారలు స్పందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మహానటి కీర్తి సురేష్ ఘాటుగా స్పందించారు. టెక్నాలజీని సరైన విధంగా వాడాలంటూ సూచించారు. 
 

Keerthy Suresh respond on  Rashmika Mandannas Deep Fake Video NSK
Author
First Published Nov 9, 2023, 2:16 PM IST | Last Updated Nov 9, 2023, 2:16 PM IST

డీప్ ఫేక్ వీడియోకు బాధితురాలైన స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna)కు మద్దతు పెరుగుతోంది. అమితాబ్ బచ్చన్ ప్రశ్నించడంతో ప్రారంభమవగా.. సెలబ్రెటీలు, పొలిటికల్ లీడర్లు కూడా ఆ విషయంలో మహిళలకు భద్రతగా కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియోకు సినీ తారలు చింతిస్తున్నారు. ఆమెకు మద్దతు తెలుపుతూ టెక్నాలజీని మిస్ యూజ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఇప్పటికే అమితాబ్ బచ్చన్, చైతూ, కేంద్రమంత్రులు, కేటీఆర్ స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy  Suresh) కూడా తీవ్రంగా స్పందించారు. డీప్ ఫేక్ వీడియోపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇన్ స్టా హ్యాండిల్ స్టోరీలో నోట్ రాసుకొచ్చారు. అలాంటి వీడియోలను క్రియేట్ చేస్తున్న వారు ప్రజలకు ఉపయోగపడేలా టెక్నాలజీని వినియోగించాలంటూ సూచించింది. 

నోట్ లో.. ‘డీప్ ఫేక్ వీడియోలతో భయంగా ఉంది. ఇలాంటి వాటిని తయారు చేసిన వ్యక్తికి నేను కోరుకునే ఒక్కటే. ఏదైనా ప్రజలు ఉపయోగపడేలా చేస్తే బాగుటుంది. ప్రస్తుతం టెక్నాలజీ మనకు వరమా? శాపమా? నాకు అర్థం కావడం లేదు. సాంతికేతికను పాజిటివిటీని పెంచేందుకు ఉపయోగించడం. ప్రజల్లో అవగాహన పెంచే మంచి అంశాలను, ఇన్ఫర్మేషన్ ను అందించేందుకు వినియోగించండి. నాన్ సెన్స్ వద్దు. ఆ దేవుడే మనవజాతిని కాపాడాలి’ అంటూ రాసుకొచ్చింది.

మహానటి కాస్తా ఆలస్యంగా స్పందించినా తన కామెంట్స్ తో డీప్ ఫేక్ వీడియో క్రియేటర్లకు చురకలు అంటించింది. ప్రస్తుతం కీర్తి సురేష్ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక కీర్తి చివరిగా ‘భోళా శంకర్’ చిత్రంతో అలరించింది. ప్రస్తుతం తమిళంలో ‘సైరెన్’, ‘రఘు తాత’, ‘రివాల్వర్ రీటా’, ‘కన్నివెడి’ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 

Keerthy Suresh respond on  Rashmika Mandannas Deep Fake Video NSK

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios