ఆ అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో ఈ చిత్రం స‌ఫ‌ల‌ం కాలేదు. కీర్తి మ‌ళ్లీ హిట్ ట్రాక్ ఎక్కలేకపోయింది. డిజాస్టర్ అయ్యిపోయింది.  పెంగ్విన్, మిస్ ఇండియా...ఇప్పుడు ఈ సినిమాతో ఆమెకు మహానటితో వచ్చిన క్రేజ్ మొత్తం పోయినట్లైంది.  ఇప్పుడు ఆమెకు ఉన్న ఏకైక ఆప్షన్ .. 

‘మ‌హాన‌టి’ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది న‌టి కీర్తి సురేష్‌(keerthy suresh). ఆ సక్సెస్ స్ఫూర్తితో వ‌రుస‌గా హీరోయిన్ ప్రాధాన్య క‌థ‌లు ఎంచుకుంటూ జోరు చూపించింది. కానీ, వాటిలో ఏ ఒక్క‌టీ కీర్తికి ఆశించిన స్థాయిలో పేరు తీసుకురాలేక‌పోయాయి. ఇప్పుడీ క్ర‌మంలోనే మొన్న శుక్రవారం రిలీజైన ‘గుడ్‌ల‌క్ స‌ఖి’గా మ‌రోసారి అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు సిద్ధ‌మైంది.

కీర్తి సురేష్ న‌టించిన తొలి క్రీడా నేప‌థ్య చిత్ర‌మిది. న‌గేష్ కుకునూర్ తెర‌కెక్కించారు. క‌రోనా ప‌రిస్థితుల వ‌ల్ల ప‌లుమార్లు వాయిదా ప‌డిన ఈ సినిమా.. ఎట్టకేల‌కు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. దీనికి దిల్‌రాజు స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తుండటం.. పాట‌లు, టీజర్లు, ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండ‌టంతో సినిమాపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఏర్ప‌డ్డాయి. ఆ అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో ఈ చిత్రం స‌ఫ‌ల‌ం కాలేదు. కీర్తి మ‌ళ్లీ హిట్ ట్రాక్ ఎక్కలేకపోయింది. డిజాస్టర్ అయ్యిపోయింది. పెంగ్విన్, మిస్ ఇండియా...ఇప్పుడు ఈ సినిమాతో ఆమెకు మహానటితో వచ్చిన క్రేజ్ మొత్తం పోయినట్లైంది. ఇప్పుడు ఆమెకు ఉన్న ఏకైక ఆప్షన్ ...మహేష్ బాబుతో చేస్తున్న సర్కారు వారి పాట.

 ఈ మూవీలో కీర్తి పాత్ర పేరు ‘కళావతి’. ఆమె పాత్ర చాలా కొత్త క్యారక్టరైజేషన్ తో అచ్చ తెలుగు ఆడపిల్లలా సాగుతుందని సమాచారం. ఈ కాలం ఆడపిల్లలో ఉండే తెగువ, థైర్యం ఉంటాయని వినికిడి. దాంతో ఖచ్చితంగా కీర్తి సురేష్ ఈ చిత్రం పూర్వ వైభవం తెస్తుందని భావిస్తోంది. పరశురాం దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14 ప్లస్‌ రీల్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి తమన్‌ స్వరాలు సమకురుస్తున్నాడు.

 బ్యాంకింగ్ రంగంలో జరిగుతున్న అతిపెద్ద కుంభకోణం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ల మీద నవీన్ యెర్నేని, వై. రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట, మహేష్ బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ బాణీలు కడుతున్నారు. మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీన ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.