మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న నటి కీర్తి సురేష్. ఈ బ్యూటీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మరో ఇంట్రస్టింగ్, ఇన్స్‌పైరింగ్ మూవీ గుడ్‌ లక్‌ సఖి. ఓ మారుమూల గ్రామంలో పుట్టిన ఓ యువతి షూటింగ్ మెడల్ సాధించటం అనే ఇన్స్‌పైరింగ్ కథతో ఈసినిమాలో రూపొందిస్తున్నారు. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

బాలీవుడ్ దర్శకుగు నగేష్‌ కుకునూర్ దర్శకతంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నాడు. దిల్‌ రాజు సమర్పణలో వర్త్‌ ఏ షాట్ మోషన్‌ ఆర్ట్స్ బ్యానర్‌పై సుధీర్ చంద్ర పాడిరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ టీజర్‌ను రిలీజ్ చేశారు.

ఈ సినిమాను స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ చేతుల మీదగా సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. టీజర్‌ను రిలీజ్ చేసిన ప్రభాస్‌ చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశాడు.