హీరో నానితో గొడవకు దిగింది.. హోమ్లీ బ్యూటీ కీర్తి సురేష్. షూటింగ్ పక్కన పెట్టిమరీ ఫైటింగ్ కు రెడీ అయ్యింది. అటు నానీ ఏం చేయలేక తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేశాడు. ఈఫన్నీ ఇన్సిడెంట్ దసరా మూవీ షూటింట్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..
హీరో నానితో గొడవకు దిగింది.. హోమ్లీ బ్యూటీ కీర్తి సురేష్. షూటింగ్ పక్కన పెట్టిమరీ ఫైటింగ్ కు రెడీ అయ్యింది. అటు నానీ ఏం చేయలేక తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేశాడు. ఈఫన్నీ ఇన్సిడెంట్ దసరా మూవీ షూటింట్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..
దసరా మూవీ షూటింగ్ లో ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. షూటింగ్ గ్యాప్ లో హీరో నాని మీరోయిన్ కీర్తి సురేష్ సరదాగా బ్యాట్మింటన్ ఆడుకున్నారు. ఆట ఆడే క్రమంలో గేమ్ విషయంలో నానీ రాంగ్ జడ్జిమెంట్ ఇచ్చేవరకూ కీర్తి సురేష్ కు బాగా కోపం వచ్చింది. ఆ కోపంతో నానీ మీదకు బ్యాట్ తీసుకుని వచ్చింది కీర్తి సురేష్. నేచురల్ స్టార్ కు మాస్ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇలా ఇంకోసారి చేస్తూ బాగుందు అంటూ గట్టిగా తిట్టేసింది. ఈక్రమంలో నాని ఏం అనలేక కీర్తి మాటలకు సరే అన్నట్టు తలూపాడు. ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నేచురల్ స్టార్ నానీ బర్త్ డే సందర్భంగా నిన్న(24 పిబ్రవరి) ఫ్యాన్స దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ నానీకి స్పెషల్ గా విష్ చేశారు అందరికంటే కాస్త డిఫరెంట్ గా విష్ చేసింది హీరోయిన్ కీర్తి సురేష్. షూటింగ్ టైమ్ లో ఇద్దరు గేమ్ ఆడుతూ.. గోడవ పడుతున్న వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోతో స్పెషల్ గా నానిని విష్ చేసింది కీర్తి సురేష్. ఇక కీర్తి విషెష్ అందరిని ఆకట్టుకుంటుంది. అంతే కాదు.. ఈ వీడిమో కూడా ఫుల్ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
ఇక శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న దసరా మూవీ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది.ఈ సినిమాపై భారీ రాను రాను బారీగా పెరుగుతున్నాయి. టీజర్ విడుదలతో అవి మరో స్థాయికి చేరాయి. నాని-కీర్తి సురేష్ డీగ్లామర్ రోల్స్ చేస్తున్నా ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా దేశ వ్యాప్తంగా దాదాపు ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈసినిమాతో ఫస్ట్ టైమ్ నాని పాన్ ఇండియా నుటచ్ చేయబోతున్నాడు. నాని సైతం చిత్ర విజయం మీద పూర్తి విశ్వాసంతో ఉన్నాడు. మరో ఆర్ ఆర్ ఆర్, కెజిఎఫ్ అవుతుందని బిగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు కూడా.
మార్చ్ 30న రిలీజ్ చేయడానికి ముస్తాబు చేస్తున్నార ఈసినిమాను. ఇక రిలీజ్ కు ముందు కాంట్రవర్సీలకు తెరలేపింది మూవీ. ఈసినిమా టీజర్ లో నానీ నోటినుంచి వచ్చిన ఓ బూతు పదం వైరల్ అవ్వడంతో పాటు వివాదాస్పదం కూడా అయ్యింది. ఈమధ్య సినిమాలకు వివాదాలు ప్రమోషన్లు గామారిపోయాయి. మరి దసరా సినిమా రిలీజ్ వరకూ ఎలా ఉంటుందో చూడాలి.
