పెళ్లి తరువాత సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తోన్న కీర్తి సురేష్.. రీసెంట్ గా కాస్త రిలాక్స్ అయ్యింది. భర్తతో కలిసి చిల్ అవ్వడానికి రొమాంటిక్ వెకేషన్ కు వెళ్లింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం తన భర్త ఆంటోనీ తట్టిల్‌తో కలిసి మాల్దీవుల్లో వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. ఈ ట్రిప్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఆమె తన సోషల్ మీడియా పేజ్ ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కీర్తి సురేష్ ఈ పోస్ట్‌లో వైట్ డ్రెస్ తో మెరిసిపోతోంది. పెద్ద టోపీ ధరించిన స్టైలిష్ సెల్ఫీతో ఫోటోలు స్టార్ట్ చేసి.. రకరకాల స్టిల్స్ కు ఫోజులిచ్చింది. అంతే కాదు వారు ఉన్న హోటల్, రిసార్ట్ లో ఎంజాయ్ చేస్తున్న వీడియోలతో పాటు బోట్ షికారు చేస్తున్న వీడియోను కూడా షేర్ చేసింది కీర్తి. అందమైన ప్రకృతి దృశ్యాల మధ్య భర్తతో కలిసి కీర్తి సురేష్ దిగిన జంట ఫోటో మరింతగా ఆకట్టుకుంటోంది.
ఈ వెకేషన్ టైమ్ లో అద్భుతమైన క్షణాలను కీర్తి సురేష్ ఫోటోలు, వీడియోల రూపంలో ఫ్యాన్స్ కు షేర్ చేస్తుంది. భర్తతో కలిసి బీచ్‌లో నడవడం, టేబుల్ టెన్నిస్ ఆడటం, సముద్రతీరాన సేదతీరడం వంటి సరదా క్షణాలను అభిమానులతో పంచుకున్నారు. అలాగే, మాల్దీవుల్లో వారు టేస్ట్ చేసిన స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ ను కూడా ఫోటో తీసి వాటిని కూడా తన ఇన్ స్టా పోస్ట్‌లో జోడించారు.
ఇంకా చివరిగా మేకప్ వేయించుకుంటున్న సరదా క్లిప్‌ను కూడా ఆమె అప్‌లోడ్ చేశారు. ఇక గత ఏడాది డిసెంబర్‌లో కీర్తి సురేష్, ఆంటోనీ తట్టిల్‌ల వివాహం జరగిన సంగతి తెలిసిందే. చిన్ననాటి స్కూల్ ఫ్రెండ్ నే పెళ్లాడింది కీర్తి. దాదాపు 15 ఏళ్లుగా వీరు ప్రేమలో ఉన్నట్టు సమాచారం. ఆంటోనీ ఒక బిజినెస్ మెన్. ఆయనకు ఇండియాతో పాటు దుబాయ్ లో కూడా వ్యాపారాలు ఉన్నట్టు సమాచారం.
ఇక కీర్తి సురేష్ సినిమాల విషయానికి వస్తే.. త్వరలో "రివాల్వర్ రీటా" అనే తమిళ కామెడీ చిత్రంలో నటించనున్నారు. కె. చంద్రు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్, రెడ్డిన్ కింగ్‌స్లే తదితరులు నటిస్తున్నారు. ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ పతాకాలపై సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీతాన్ని సీన్ రోల్డాన్ అందిస్తున్నారు.


