స్టార్‌ హీరోయిన్‌ కీర్తిసురేష్‌ ఓ డైరెక్టర్‌ని వెంటబడి మరీ చితకబాదిన ఘటన తాజాగా చోటు చోటు చేసుకుంది. ఇది పెద్ద సంచలనం సృష్టిస్తుంది. అంతేకాదు ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. మరి కీర్తిసురేష్‌ ఎందుకు డైరెక్టర్‌ని కొట్టింది. ఇంతకి ఆ డైరెక్టర్‌ ఎవరూ అనేది తెలుసుకుంటే..

`మహానటి`తో జాతీయ వ్యాప్తంగా స్టార్‌ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది కీర్తిసురేష్‌. ఈ సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డుని కూడా సొంతం చేసుకుంది. దీంతో ఈ అమ్మడికి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో భారీ ఆఫర్స్ వస్తున్నాయి. తెలుగులో ప్రస్తుతం నితిన్‌తో `రంగ్‌దే` చిత్రంలో నటిస్తుంది. వెంకీ అట్లూరి దీనికి దర్శకుడు. ఈ సినిమా సెట్‌లో దర్శకుడు వెంకీని కీర్తిసురేష్‌ గొడుగుతో వెంటబడి మరీ కొట్టడం ఇప్పుడు హాట్‌ న్యూస్‌గా మారింది. 

కరోనా బ్రేక్‌ తర్వాత ఇటీవల చిత్ర షూటింగ్‌ ప్రారంభమైంది. సూర్య దేవరనాగవంశీ దీన్ని నిర్మిస్తున్నారు. కొన్ని పాట‌ల చిత్రీక‌ర‌ణ కోసం యూనిట్ దుబాయ్‌కి వెళ్లింది. ఈ క్ర‌మంలో సినిమా సెట్లో  కీర్తి సురేశ్ కాసేపు రెస్ట్ తీసుకుంది. అందులో భాగంగా ఓ కునుకు తీస్తుండ‌గా డైరెక్ట‌ర్ వెంకీతో క‌లిసి నితిన్ ఆమె వెన‌కాల చేరి సెల్ఫీ దిగారు. అనంత‌రం దాన్ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. షూటింగ్‌తో త‌మ‌కు చెమ‌ట‌లు ప‌డుతుంటే కీర్తి మాత్రం హ్యాపీగా రిలాక్స్ అవుతోంద‌ని నితిన్ అక్క‌సు వెళ్ల‌గ‌క్కారు.

ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీనికి కీర్తిసురేష్‌ సైతం స్పందించింది. షూటింగ్‌ సెట్లో ఎప్పుడూ నిద్రపోకూడదన్న గుణపాఠం నేర్చుకున్నానని తెలిపింది. అంతేకాదు నితిన్‌, వెంకీపై రివీంజ్‌ తీర్చుకుంటానని తెలిపింది. ఇప్పుడు ఆ ఛాన్స్ దక్కించుకుంది. చేతికి ఓ గొడుగు దొర‌క‌డంతో వెంకీ అట్లూరిని కీర్తి చిత‌క‌బాదారు. ఆయ‌న‌ను ప‌రిగెత్తించి మ‌రీ కొట్టారు. ఇదంతా సరదాగా జరిగిన సంఘటన. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండటం విశేషం. ఈ సినిమాని సంక్రాంతికి విడుదలకు చిత్ర బృందం ప్లాన్‌ చేస్తుంది.