మహానటి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న కీర్తి సురేష్ స్పీడ్ పెంచుతుంది అనుకుంటే చాలా నెమ్మదిగా కథలను సెలెక్ట్ చేసుకుంటుంది. ఎందుకని అడిగితే కథలు ఎన్నో వస్తున్నాయి కానీ అవి మనసు లోపలి వరకు వెళ్లడం లేదని అందుకే ఆచితూచి కథలను సెలెక్ట్ చేసుకుంటున్నట్లు సమాధానమిస్తోంది. 

ఇకపోతే మహానటి తరువాత అనుకోకుండా ఈ బ్యూటీ ఓ మంచి బయోపిక్ కథను సెలెక్ట్ చేసుకుంది. కాకపోతే ఈసారి లీడ్ రోల్ కాదు. గత కొన్ని రోజులుగా బాలీవుడ్ లో అజయ్ దేవగన్ తో కీర్తి సురేష్ నటించనుందని అనేక కథనాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా ఒక ఫుట్ బాల్ కోచ్ బయోపిక్ అని తెలుస్తోది. 

1956 ఒలింపిక్స్‌లో భారత ఫుట్ బాల్ జట్టు మొదటిసారి సెమీఫైనల్‌ చేర్చడంలో  హైదరాబాద్‌కు చెందిన ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ పాత్ర ఎంతో ఉంది. అయితే ఈ బయోపిక్ లో అజయ్ దేవగన్ అబ్దుల్ రహీమ్ పాత్రలో కనిపించనున్నాడు. అమిత్ శర్మ తెరకెక్కిస్తున్న బయోపిక్ లో కీర్తిసురేష్ ఫీమేల్ లీడ్ లో కనిపించనుంది.