మహానటి లో లీడ్ రోల్ చేస్తున్న కీర్తి సురేష్ కీలక పాత్ర పోషిస్తున్న షాలిని పాండే వైరల్ గా మారిన కీర్తి, షాలినిల ఫోటో

నేను శైలజ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది కీర్తి సురేష్. ఆ తర్వాత నేను లోకల్ చిత్రంలో తన నటనతో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలను అందుకుంటున్న కీర్తి.. తెలుగులో ‘మహానటి’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

అలనాటి లెజండరీ నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సమంత, దుల్కర్ సల్మాన్, ప్రకాష్ రాజ్ , మోహన్ బాబు లాంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే... ఈ సినిమా షూటింగ్ సంబంధించి ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కీర్తీ సురేష్, అర్జున్ రెడ్డి ఫేం షాలిని పాండే లు షాట్ కోసం చక్కగా ముస్తాబై కనిపిస్తున్నారు. కీర్తి, షాలిని చాలా అందంగా ముస్తాబై ఉన్న ఆ ఫోటో అందరినీ ఆకట్టుకుంటోంది.

మహానటిలో కీర్తి లుక్ ఇదే అంటూ గతంలో ఒక ఫోటో నెట్టింట చక్కర్లు కొట్టగా అది సినిమాలోనిది కాదని.. వస్త్ర దుకాణం ప్రకటనకి సంబంధించినదని కీర్తి చెప్పింది. దీంతో మహానటి కి సంబంధించి బయటకు వచ్చిన తొలి ఫోటో ఇదే. ఈ చిత్రానికి నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు.