ప్రముఖ తమిళ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ రవిచందర్‌, `మహానటి` ఫేమ్‌ కీర్తిసురేష్‌ బర్త్ డే విశెష్‌ చెప్పుకున్నారు. శుక్రవారం సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు కీర్తిసురేష్‌ విశెష్‌ చెప్పింది. ప్రత్యేకంగా విశెష్‌తో సర్ ప్రైజ్‌ చేసింది. శుక్రవారం అనిరుధ్‌ 30 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.

మరోవైపు కొన్ని గంటల వ్యవధిలో కీర్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. శనివారం కీర్తి పుట్టిన రోజు. ఆమె 28వ పడిలోకి అడుగుపెడుతుంది. దీంతో ఈ రాత్రి కీర్తికి విశెష్‌ చెప్పారు అనిరుధ్‌. శుక్రవారం రాత్రి వీరిద్దరు పార్టీలో మునిగితేలారు. ఈ సందర్భంగా వీరిద్దరు కలిసి దిగిన ఫోటోని పంచుకున్నారు. కీర్తి ట్విట్టర్‌ ద్వారా ఫోటోలను షేర్‌ చేసింది. 

ప్రస్తుతం కీర్తి `మిస్‌ ఇండియా`, `గుడ్‌లఖ్‌ సఖి`, `మరక్కర్‌`, `రంగ్‌ దే`, `అన్నాత్తే`, `సాని కాయిధమ్‌` అని తెలిపింది. ప్రస్తుతం `మాస్టర్‌` చిత్రానికి అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు.