'మహానటి' సినిమాకి గాను ఉత్తమనటిగా జాతీయ అవార్డు అందుకొని తన స్థాయిని మరింత పెంచుకుంది కీర్తి సురేష్. 'మహానటి' సినిమా సమయంలోనే చాలా మంది దర్శకులు ఆమెతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తీయడానికి ముందుకొచ్చారు. నేషనల్ అవార్డుతో ఇలాంటి అవకాశాలు మరింతగా పెరుగుతున్నాయి.

జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించగానే మరో సినిమా అనౌన్స్ అయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. తెలుగులో రెండు సినిమాలు చేస్తున్న ఆమె తమిళంలో విజయ్ సినిమాలో కూడా నటిస్తోంది. అలానే మోహన్ లాల్ హీరోగా మలయాళంలో రూపొందుతోన్న సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తోంది.

ఇవి కాకుండా తాజాగా మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీన్ని తమిళ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ నిర్మిస్తున్నారు. ఇటీవలే రజినీకాంత్ 'పేట' సినిమాను రూపొందించిన కార్తిక్ సుబ్బరాజ్ ఇప్పుడు నిర్మాతగా మారి సినిమా  చేస్తున్నాడు.

ఇదొక థ్రిల్లర్ సినిమా అని సమాచారం. ఈశ్వర్ కార్తిక్ ఈ సినిమాతో దర్శకుడిగా మారబోతున్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో థ్రిల్లర్ సినిమాల హవా నడుస్తోంది. దీంతో ఈ సినిమాకి క్రేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. పైగా కీర్తి మార్కెట్ స్థాయి పెరగడంతో బిజినెస్ కూడా బాగా జరుగుతుంది.