మహానటుడితో జతకట్టనున్న మహానటి.?

First Published 26, Jun 2018, 6:35 PM IST
Keerthi suresh to act with NTR in RRR Film
Highlights

మహానటుడితో జతకట్టనున్న మహానటి.?

ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అరవింద సమేత వీర రాఘవ. ఫస్ట్ లుక్ తోనే ఎనలేని క్రేజ్ తీసుకొచ్చేశాడు. ఈ సినిమా తర్వాత రాజమౌళి మల్టీస్టారర్ సినిమాపైనే అందరి కళ్లు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువడుతుందా అని అటు ఎన్టీఆర్, ఇటు రామ్ చరణ్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్-రామ్ చరణ్‌తో రాజమౌళి చిత్రమైతే ఖాయమే కానీ ఇప్పటి వరకూ ఒక్క అధికారిక ప్రకటన కూడా లేదు. కానీ ఈ చిత్రంపై ఇప్పటికే బోలెడన్ని ఊహాగానాలు. సినిమా అలా ఉంటుంది.. ఇలా ఉంటుందని నిన్న మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఒక హీరోయిన్ ఖరారైందని వార్తలు వస్తు్న్నాయి. 

‘మహానటి’తో స్టార్ డమ్ సంపాదించిన నటి కీర్తి సురేష్. పవన్ కళ్యాణ్‌తో ‘అజ్ఞాతవాసి’లో నటించినప్పుడే ఈ అమ్మాయి స్థానం పెరిగిపోయింది. ఇప్పుడు ‘మహానటి’ హిట్‌తో తెలుగింటి అమ్మాయి అయిపోయింది. అయితే రాజమౌళి మల్టీస్టారర్‌లో కీర్తి సురేష్ నటిస్తోందన్న వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో తారక్ కు జోడీగా ఆమెని తీసుకుంటున్నట్టు సమాచారం. అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ ఆమె పాత్ర ఫైనల్ అంటున్నారు.

loader