'మహానటి' సినిమా తరువాత కీర్తి సురేష్ తన సినిమాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆచితూచి ముందడుగు వేస్తోంది. తాజాగా ఆమె ఓ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సాగే సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ సినిమాలో కీర్తి సురేష్ తో పాటు ఆది పినిశెట్టి, జగపతిబాబు, రాహుల్ రామకృష్ణలు ప్రధాన పాత్రలు పోషించబోతున్నారు. వర్త్ ఏ షాట్ సంస్థ ఈ సినిమాను నిర్మించాబోతుంది. స్పోర్ట్స్, రొమాన్స్, కామెడీ అంశాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు నగేష్ కుకునూర్. 

బాలీవుడ్ లో 'హైద‌రాబాద్ బ్లూస్‌', 'ఇక్బాల్' వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన నగేష్ ఇప్పుడు కీర్తి సురేష్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ మలయాళంలో ఓ సినిమాలో  నటిస్తున్నారు. అలానే అజయ్ దేవగన్ నటిస్తోన్న ఓ చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది.