మిస్ ఇండియా అంటే నేను కాదు నా చాయ్ అంటుంది కీర్తి సురేష్. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మిస్ ఇండియా. దర్శకుడు నరేంద్ర నాథ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్ కోనేరు నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. నదియా, రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు కీలక రోల్స్ చేస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ఇటీవల విడుదలై సూపర్ రెస్పాన్స్ అందుకుంది. 

ఈ మూవీకి సంబంధించిన అనేక విషయాలు కీర్తి సురేష్ పంచుకుంది. చాయ్ కి కాఫీకి జరిగే యుద్ధమే మిస్ ఇండియా అని ఆమె చెప్పుకొచ్చారు. నరేంద్ర నాథ్ చెప్పిన ఈ లైన్ తనకు బాగా నచ్చిందని కీర్తి చెప్పారు. అమెరికాలో అందరూ కాఫీ తాగుతారు, అలాంటి నేలపై ఇండియన్ అమ్మాయి మన చాయ్ బిజినెస్ తో తన లక్ష్యం ఎలా చేరుకుంది అనేదే ఈ మూవీ నేపథ్యం అని కీర్తి చెప్పారు. 

ఓటిటిలో విడుదలవుతున్న నా రెండవ చిత్రం మిస్ ఇండియా అని కీర్తి చెప్పుకొచ్చారు. ఓ ఛాలెంజింగ్ రోల్ చేశానన్న కీర్తి దర్శకుడు నరేంద్ర పై   ప్రశంసించారు. కొత్త దర్శకుడైనా తన పాత్ర తీరు చక్కగా వివరించాడని కీర్తి చెప్పడం జరిగింది. మహానటి చిత్రం తరువాత ఈ మూవీకి నేను మాత్రమే న్యాయం చేయగలనని మహేష్ కోనేరు నన్ను ఎంపిక చేశారు అన్నారు. 50 శాతం మూవీ అమెరికాలోనే చిత్రీకరించగా, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించారు అని కీర్తి మిస్ ఇండియా మూవీ గురించి వివరించారు. నవంబర్ 4 న మిస్ ఇండియా మూవీ నెట్ ఫ్లిక్స్ లో విడుదల అవుతుంది.