మహానటి సినిమాతో ఒక్కసారిగా స్టార్ డమ్ అందుకున్న కీర్తి సురేష్ కి ఇక సౌత్ లో తిరుగులేదని అంతా అనుకున్నారు. కానీ సర్కార్ సినిమా తరువాత కీర్తి మరో తమిళ్ సినిమాలో అవకాశం అనుకోలేదు. కమర్షియల్ కధలు వస్తున్నా కూడా అంత ఈజీగా ఒప్పుకోవడం లేదట. 

అందుకు కారణం మహానటి సినిమా వల్లే అని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ క్లారిటీ ఇచ్చింది. 'మహానటి సినిమా తరువాత అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. నేను చేసిన ప్రతి సినిమాపై వారి ద్రుష్టి ఉంటుంది. వారిని మెప్పించాడానికి జాగ్రత్తగా ఉండాల్సిందే. కంటెంట్ లో క్యారెక్టర్ ఆకర్షించే విధంగా ఉంటే తప్ప గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేను. 

తమిళ్ లో నాకు చాలా ఆఫర్స్ వస్తున్నాయి. కానీ అందులో ఏవి నచ్చడం లేదు. మంచి పాత్రలను ఎంచుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుంది' అని మహానటి బ్యూటీ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం మలయాళం తెలుగులో కలిపి రెండు సినిమాలను చేస్తోంది. బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ వస్తుండడంతో అక్కడ కూడా ఒకడుగు వేయాలని కీర్తి సురేష్ ఆలోచిస్తోంది.