హీరోయిన్ గా అతి తక్కువ సినిమాలు చేసినప్పటికీ స్టార్ హోదా దక్కించుకుంది కీర్తి సురేష్. 'మహానటి' సినిమాతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తెలుగు, తమిళ భాషల్లో అగ్ర హీరోలతో జత కడుతూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది.

కీర్తి సురేష్ తల్లి కూడా నటి అనే సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ ని 'మీ తల్లి కంటే మీరేఎక్కువ పేరు సంపాదించుకున్నట్లు ఉన్నారు?' అని ప్రశ్నించగా.. దానికి ఆమె అమ్మ స్థాయిని అందుకోవడం చాలా కష్టమని, ఆమె 120 సినిమాల వరకు చేసిందని కాకపోతే మాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేయడంతో ఇక్కడి వారికి ఆమె గొప్పతనం తెలియదని చెప్పింది.

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తన తల్లి సక్సెస్ అయిందని, పెళ్లి తరువాత వ్యక్తిగత జీవితం కోసం నటనకు దూరమైందని.. అయినా సంతోషంగా ఉన్నానని చెప్పేవారని తెలిపింది.

నటిగా, వ్యక్తిగా మా అమ్మే నా రోల్ మోడల్ అని అంటోంది కీర్తి సురేష్. కుటుంబ గౌరవానికి భంగం కలిగించని సినిమాలే చేయాలని ముందే నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చింది.