Asianet News TeluguAsianet News Telugu

మహేష్, రాజమౌళి మూవీపై హాలీవుడ్ మీడియా ఆసక్తి.. కీరవాణి లేటెస్ట్ కామెంట్స్

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం అంతర్జాతీయ వేదికలపై పెను ప్రభంజనం సృష్టించింది. అత్యుత్తమ పురస్కారం ఆస్కార్ ని సైతం గెలుచుకుంది.

Keeravani latest comments on Mahesh and Rajamouli movie
Author
First Published Mar 18, 2023, 10:43 PM IST

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం అంతర్జాతీయ వేదికలపై పెను ప్రభంజనం సృష్టించింది. అత్యుత్తమ పురస్కారం ఆస్కార్ ని సైతం గెలుచుకుంది. ఆర్ఆర్ఆర్ చిత్రం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ప్రతిష్టాత్మకమైన అకాడమీ అవార్డు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. నాటు నాటు సాంగ్ కి గాను ఈ ఫీట్ దక్కింది. 

ఆర్ఆర్ఆర్ చిత్రంతో రాజమౌళి సత్తా ప్రపంచం మొత్తం తెలిసింది. జేమ్స్ కామెరూన్, స్టీవెన్ స్పీల్ బర్గ్ లాంటి హాలీవుడ్ దిగ్గజాలు సైతం రాజమౌళి దర్శకత్వ శైలికి ఆకర్షితులు అయ్యారు. దీనితో రాజమౌళి తదుపరి చిత్రానికి హాలీవుడ్ ఆడియన్స్ ఇంకా ఎక్కువ ఆసక్తి చూపుతారు అని చెప్పడం లో సందేహం లేదు. 

నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు గెలిచిన తర్వాత రాజమౌళి నెక్స్ట్ మూవీ ఏంటి అనే ఆసక్తి హాలీవుడ్ మీడియాలో మొదలైంది. రాజమౌళి తదుపరి చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉండబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్క్రిప్ట్ డెవలప్ మెంట్ జరుగుతోంది. 

ప్రపంచం మొత్తం చుట్టి వచ్చే సాహసికుడు కథ అని, అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్ మూవీ అని మాత్రమే ఇప్పటి వరకు లీకులు ఇచ్చారు. రాజమౌళి, మహేష్ మూవీ గురించి పూర్తి స్థాయి వివరాలు ఇంకా తెలియదు. ఇటీవల కీరవాణి హాలీవుడ్ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. మీ తదుపరి చిత్రం ఏంటి అని ప్రశ్నించగా.. నా తదుపరి చిత్రం కూడా రాజమౌళితోనే ఉంది. 

ఇండియాలో మరో సూపర్ స్టార్ అయిన మహేష్ బాబు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీగా ఈ చిత్రం ఉండబోతోంది అని కీరవాణి అన్నారు. కీరవాణి చెప్పింది తెలిసిన ఇన్ఫర్మేషన్ అయినప్పటికీ హాలీవుడ్ వేదికగా చెప్పడంతో వైరల్ అయ్యాయి. 

తన చిత్రాలకు హాలీవుడ్ హాలీవుడ్ స్థాయిలో ఉన్న డిమాండ్ ని దృష్టిలో పెట్టుకునే జక్కన్న ఈ చిత్రానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం కోసం హాలీవుడ్ సంస్థల్ని రంగంలోకి దించబోతున్నట్లు కూడా లీకులు అందుతున్నాయి. అదే కనుక జరిగితే ఇండియాలో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కావడం ఖాయం. 

Follow Us:
Download App:
  • android
  • ios