ఆస్కార్ సాధించిన టాలీవుడ్ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ ఎమ్ కీరవాణికి అరుదైన బహుమతి లభించింది. ఆబహుమతి చూసి ఆయన ఏకంగా కన్నీళ్ళు పెట్టారంటే.. కీరవాణికి మెచ్చిన..మనసుకు నచ్చిన ఆ బహుమతి ఏంటీ..?  

నాటు నాటు పాటతో ఆస్కార సాధించి టాలీవుడు ప్రతిష్టను పదింతలు పెంచాడు మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ ఎమ్ కీరవాణి. అంతకు మించిన అభిమానాన్ని ప్రపంచ వ్యాప్తంగా పొందారు కీరవాణి. నాటు నాటు పాటకు వరల్డ్ వైడ్ గా పాపులారిటీ వచ్చింది. అంతే కాదు సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ ఈ పాటకు కాలుకదిపారు. ఇక ఆస్కార్ వచ్చిన తరువాత ఈపాటను వినేవారి సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఇన్ని సాధించిన కీరవాణిని ఒక్క బహుమతి కంటతడి పెట్టించింది. అది కూడా హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ రిచర్డ్ కార్పెంటర్ పంపిచిన గిఫ్ట్ కీరవాణి మనసకు హత్తకుంది. 

ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌ సాధించిన సంగీత దర్శకుడు కీరవాణికి అమెరికా దిగ్గజ సంగీతకారుడు, గాయకుడు రిచర్డ్‌ కార్పెంటర్‌ నుంచి ప్రశంసలు లభించాయి. కీరవాణికి కార్పెంటర్ అంటే ప్రాణం. ఆయన పాటలు వింటూ.. సంగీత దర్శకుడిగా ఎదిగారు కీరవాణి. అంతలా ఆయన ప్రభావం కీరవాణిపై ఉండేది. అంతే కాదు ఆస్కార్ వేదికపై కూడా కార్పెంటర్ సంగీతం గురించి చెప్పారు మ్యూజిక్ డైరెక్టర్. అంతే కాదు.. ఆస్కార్ తీసుకున్న తరువాత కార్పెంటర్‌ పాట టాప్ ఆఫ్‌ ద వరల్డ్‌ ను కాస్త మార్చి అదే వేదికపైనా ఆలపించారు కీరవాణి. అది హైలెట్ గా మారింది. అక్కడ ఉన్నవారిని ఆకర్షించింది. 

ఇక కీరవాణి ఆస్కార్ సాధించడం.. అతను తన అభిమాని అని తెలుసుకున్న కార్పెంటర్.. కీరవాణి రీమిక్స్ చేసిన పాటను బదులుగా కార్పెంటర్ అదే పాటను తన కూతుళ్లు మాండీ.. ట్రాకీలతో కలిసి పాడించి కీరవాణి విజయాన్ని మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. మీ విజయం వల్లే మనం ప్రపంచ అగ్రభాగాన ఉన్నాం అంటూ కార్పెంటర్ పాడిన పాటను సోషల్ మీడియాలో శేర్ చేశారు. మా కుటుంబం తరుపున మీకు చిన్న బహుమతి అంటూ రాసుకొచ్చారు రిచర్డ్. 

View post on Instagram

ఇక దిగ్గజ సంగీత శిఖరం అయిన రిచర్డ్ తనకోసం ఇలా పాటను పాడించి పంపడంతో కీరవాణి ఎమోషనల్ అయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. తన ఆరాధ్య దైవం ఇలా తనకోసం పాట పాడి ట్వీట్ చేయడంతో భావోద్వేగం ఆపుకోలేకపోయారు కీరవాణి. ఇక రీచర్డ్ గురించి చెప్పుకోవాలి అంటే.. ఆయన 70 వ దశకంలో స్టార్ సింగర్ గా వెలుగు వెలిగారు. తన సొదరితో కలిసి సింగర్ గా కొన్ని వేల ప్రదర్శనలు ఇచ్చారు. ఎంతో మంది అభిమానులను సంపాధించుకున్నారు కార్పెంటర్.