Asianet News TeluguAsianet News Telugu

వామ్మో బాహుబలి మ్యూజిక్ కూడా కాపీనే... అడ్డంగా బుక్కయిన కీరవాణి

  • బాహుబలి మ్యూజిక్ పై కాపీ ఆరోపణలు
  • ఒరిజినల్ మ్యూజిక్ బిట్ ను వైరల్ చేస్తున్న నెటిజన్లు
  • కీరవాణి కూడా కాపీ క్యాటేనా?
keeravani also became copy cat for bahubali music background score

కాపీ కొట్టడం అంత ఈజీ అయిపోయిందా... ఏమో అది మన తెలుగు సినిమా దర్శకులు, కథా రచయితలు, సంగీత దర్శకులు ఇలా కాపీ కొట్టటానికే కాపీ రైట్స్ తీసుకున్నట్టున్నారు. ఇప్పటికే తెలుగు సినిమాలకు కథా రచయితల కొదువ వుందని ఓవైపు సీనియర్ రచయిత పరుచూరి గోపాల కృష్ణ లాంటి వాళ్లు అంటూనే వున్నారు. కొత్త రైటర్స్ అంతా ఏ హాలీవుడ్ మూవీనో, ఇతర భాషా చిత్రాన్నో కాపీ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.

 

మాటల మాంత్రికుడిగా పేరుగాంచిన త్రివిక్రమ్ లాంటి వాడే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కోసం ఓ ఫ్రెంచ్ మూవీని మక్కికిమక్కి దించేశాడని ఆరోపణలు వచ్చాయి. ఇలా ప్రముఖులంతా కాపీ ఆరోపణలు ఎదుర్కొంటుంటే... తాజాగా తెలుగు సినిమా రేంజ్ ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లిన బాహుబలికి సంగీతం అందించిం కీరవాణి కూడా కాపీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అది కూడా బాహుబలికి అందించిన మ్యూజిక్ విషయంలో.

 

ఇంతకీ మేటరేంటంటే.. తెలుగులో దిగ్గజ సంగీత దర్శకుల్లో ఒకరిగా చెప్పుకునే ఎంఎం కీరవాణి పేరు కూడా ఇప్పుడు కాపీ క్యాట్ జాబితాలోకి ఎక్కేసింది. 'బాహుబలి'.. తెలుగు ప్రపంచం గర్వించదగ్గ గొప్ప సినిమా అని ఇండస్ట్రీ అంతా దాని గురించి గొప్పగా చెప్పుకున్నాం. ఆ సినిమా కోసం పనిచేసిన టెక్నీషియన్స్ గురించి.. వాళ్ల టాలెంట్ గురించి అంతా ప్రశంసిస్తూనే ఉన్నారు. ఇలాంటి తరుణంలో కీరవాణిపై 'కాపీ' ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

 

బాహుబలిలో ఓ సీన్ కోసం అక్కినేని నాగేశ్వరరావు నటించిన 'కీలుగుర్రం' చిత్రంలోని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను కీరవాణి వాడుకున్నారనేది ఆయనపై వస్తున్న ఆరోపణ. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 'కీలుగుర్రం' బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌నే కాస్త మార్చేసి కీరవాణి బాహుబలిలో దించారని అంటున్నారు.

 

అయితే కీలుగుర్రం నుంచి కీరవాణి స్ఫూర్తి పొంది ఉండవచ్చు కానీ... కీలుగుర్రం బీజీఎంకు, బాహుబలి బీజీఎంకు కాస్త తేడా ఉందని అంటున్నారు కొందరు. అయితే కేవలం ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన మ్యూజిక్ పరికరాల వల్ల సంగీతం ఇలా వచ్చిందని, ఆరోజుల్లోనే అంత అద్భుతమైన సంగీతం అందించిన ఘంటసాలతో  పోలిస్తే ఇప్పుడిచ్చిన మ్యూజిక్ ఏ రేంజ్ లో వుందో కంపేర్ చేసుకోవచ్చని మరికొందరు అంటున్నారు.

బాహుబలి కాపీ మ్యూజిక్ కు సంబంధించిన ఒరిజినల్ సోర్స్ మ్యూజిక్ విడియో.... ఈక్రింద...

 

 

గతంలో ఛత్రపతి సినిమా బీజీఎం విషయంలోనూ కీరవాణిపై విమర్శలు వచ్చాయి. ఓ జపాన్ సినిమా నుంచి బీజీఎం ట్రాక్ ఎత్తుకొచ్చేసి.. ఉన్నది ఉన్నట్లుగా దించేశారన్న టాక్ వినిపించింది. ఆ వీడియోలు కూడా ఇప్పటికీ యూట్యూబ్ లో ఉన్నాయి. ఓవైపు కథల కాపీ గోల కొనసాగుతుంటే.. మరోవైపు మ్యూజిక్‌పై కూడా కాపీ ఆరోపణలు వెల్లువెత్తుతుండటం టాలీవుడ్ ఇమేజ్‌ను మసక బార్చేదిగా కనిపిస్తోంది. ఇకపైనయినా కాపీలకు దూరంగా ఉంటేనే తెలుగు పరిశ్రమను పక్క పరిశ్రమల వాళ్లు చిన్నూపు చూడకుండా తగిన గౌరవం లభిస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios