సీనియర్ నటుడు దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ కావడానికి సమయం దగ్గరపడుతోంది. దర్శకుడు క్రిష్ షూటింగ్ కు ఏ మాత్రం బ్రేక్ వేయకుండా ముందుకు సాగుతున్నాడు. ఇక ఈవెంట్స్ తో సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ డోస్ పెంచాలని ప్లాన్ చేస్తున్నారు. బిజినెస్ పనులు కూడా మరికొన్ని రోజుల్లో మొదలుకానున్నాయి. 

అసలు విషయంలోకి వస్తే.. తెలంగాణాలో ఎన్టీఆర్ బయోపిక్ భారీ స్థాయిలో రిలీజ్ చెయ్యాలని ముందు నుంచి అనుకుంటున్నదే. ఎక్కువగా లాభాలు అందే నైజం ఏరియాలో ఎక్ట్రా షోలకు కూడా ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు అంతా రివర్స్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే బాలకృష్ణ ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం జోరుగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. 

చేసేదేదో సైలెంట్ గా చేసుకోకుండా అనవసరంగా టీఆరెస్ అధినేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పైగా బుల్ బుల్ అంటూ ఐటి కి అర్ధం నేర్పింది చంద్రబాబే అనడం ఇలా పలు కారణాలు బాలయ్యకు మరింత నెగిటివ్ టాక్ ను తెచ్చిపెట్టాయి. ఇక ఎన్టీఆర్ సినిమాకు ఇప్పుడు అనుకున్నంత రేంజ్ లో రిలీజ్ కాదని ఎక్కువ షోలకు పర్మిషన్ దొరకడం చాలా కష్టమనిటాక్ వస్తోంది. 

గతంలో గౌతమై పుత్ర శాతకర్ణి సినిమా స్పెషల్ షోలకు కేసీఆర్ సింగిల్ సిట్టింగ్ లో పర్మిషన్ ఇచ్చారు. కానీ ఇప్పుడు తెలుగుదేశంపై ఆయన ఎలాంటి ఆలోచనతో ఉన్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మరి ఎన్టీఆర్ సినిమా రిలీజ్ సమయంలో ఎలాంటి సీన్స్ చోటుచేసుకుంటాయో చూడాలి.