ఎలక్షన్స్ మూమెంట్ లో ఈ ఏడాది బయోపిక్ లతో టాలీవుడ్ బాగానే హల్చల్ చేస్తోంది. అయితే ఏ పొలిటికల్ బయోపిక్ కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోతోంది. యాత్ర - ఎన్టీఆర్ అనంతరం ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి బయోపిక్ ఉద్యమసింహంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

కొన్ని నెలల క్రితమే సినిమాకు సంబందించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక మొన్నటివరకు అనుకోని విధంగా సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వస్తోంది.  ఫైనల్ గా ఇప్పుడు సినిమా రిలీజ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు చిత్ర నిర్మాత కల్వకుంట్ల నాగేశ్వర రావ్. మార్చ్ 29న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. 

కేసీఆర్ పాత్రలో నూతన నటుడు నటరాజన్ నటించిన ఈ సినిమాలో కేసీఆర్ చేసిన తెలంగాణ ఉద్యమాన్ని మెయిన్ గా చూపించనఉన్నట్లు తెలుస్తోంది. ఇక  అల్లూరి కృష్ణం రాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సినిమాలో పలువురి రాజకీయ నాయకుల కుట్రలను కూడా చూపించనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాను జనాలు ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి.