Asianet News TeluguAsianet News Telugu

కౌన్‌ బనేగా కరోడ్‌పతి లో రేవంత్ రెడ్డి ప్రశ్న, అమితాబ్ ఏమన్నాడంటే..?

కౌన్ బనేగా కరోడ్ పతి షోలో రేవంత్ రెడ్డి ప్రస్ధావన. ఎక్కడో హిందీలో జరిగే షోలో జరిగే షో.. ముంబయ్ లో షూటింగ్.. అక్కడ రేవంత్ ప్రస్తావణ ఎందుకు వచ్చిందంటే..? 
 

KBC Contestant Question On Telangana CM Revanth Reddy JMS
Author
First Published Dec 29, 2023, 6:22 PM IST

కౌన్‌ బనేగా కరోడ్‌పతి అమితాబచ్చన్ హోస్ట్ గా 24 ఏళ్ల నుంచి  సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ షోకి బాలీవుడ్ తో పాటు దేశ వ్యాప్తంగా ఎంత ఆదరణఉందో తెలిసిందే. ఇండియాలో  అత్యధిక ఆదరణ ఉన్న క్రేజీ షోలలో కెబిసి ఒకటి. హిందీలో స్టార్ట్ అయిన ఈ షోను దాదాపు అన్ని ప్రాంతీయ భాషల్లో స్టార్లు అనుకురిస్తూ.. వారి భాషల్లో చేస్తున్నారు. మన తెలుగులో ఈ షో.. ఎవరు మీలో కోటీశ్వరుడు, మీలో ఎవరు కోటీశ్వరుడు అనే రెండు  పేర్లతో మూడు నాలుగు సీజన్లు రన్ అయ్యింది. ఎన్టీఆర్, నాగార్జున, చిరంజీవి లాంటి స్టార్స్ ఈ షోకి హోస్టింగ్ చేశారు. అయితే హిందీలో ప్రస్తుతం 15వ సీజన్ రన్ అవుతుండగా.. ఈ సీజన్ లో ఓ ఎపిసోడ్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావన వచ్చింది. 

  అయినా  ఏమాత్రం క్రేజ్‌ తగ్గలేదు. ప్రజెంట్‌ 15వ సీజన్‌ నడుస్తోంది. కాగా  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రశ్న వచ్చింది. అయితే ఈ ప్రశ్నకు సమాధానంచెప్పడానికి కంటెస్టెంట్ లైఫ్ లైన్ ను కూడా ఉపయెగించారు. ఈ నెల 15న ప్రసారమైన కేబీసీ ఎపిసోడ్‌లో రూ.40 వేల ప్రశ్నగా రేవంత్‌ రెడ్డి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు? అని పార్టిసిపెంట్‌ను హోస్ట్‌ అమితాబ్‌ ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, మధ్యప్రదేశ్‌, ఆంధప్రదేశ్‌ అని ఆప్షన్స్ ఇచ్చారు.

 

అయితే అమితాబ్ ఎదురుగా కూర్చున్న  కంటెస్టెంట్ సమాధానం చెప్పలేకపోయింది. .. కన్‌ఫ్యూజ్ అయ్యింది. దీంతో లైఫ్‌లైన్‌ ఆప్షన్ తీసుకుంది. పోల్ తర్వాత, 80 శాతం మంది ప్రేక్షకులు తెలంగాణ అని..  11 శాతం మంది  ఛత్తీస్‌గఢ్ అని సమాధానం ఇచ్చారు. దాంతో ఆమె కూడా   తెలంగాణ లాక్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో ఆమె చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అయ్యింది. ఇక రీసెంట్ గా జరిగిన  ఎన్నికల్లో తెలంగాణలో అధికారం మారిందని.. తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారని ఈ సందర్భంగా అమితాబ్ అందరికి వివరణ ఇచ్చారు. 

.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios