కావ్య థాపర్‌కి బ్యాక్ టూ బ్యాక్ రెండు ఆఫర్లు.. దశ తిరిగినట్టేనా?
హాట్ హీరోయిన్ కావ్య థాపర్ ఇటీవల `బిచ్చగాడు 2`తో సక్సెస్ అందుకుంది. తాజాగా బ్యాక్ టూ బ్యాక్ రెండు ఆఫర్లు అందుకుంది. ఆమె పెద్ద ప్రాజెక్ట్ లు రావడం విశేషం.

హీరోయిన్ కావ్య థాపర్.. తన హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతుంది. దాచుకోకుండా అందాలు ఆరబోస్తూ క్రేజ్‌ని సొంతం చేసుకుంది. హాట్ బాంబ్‌లా తయారవుతుంది. కెరీర్ ప్రారంభంలోనే బోల్డ్ ఫోటో షూట్ చేసి రచ్చ చేసింది. నెట్టింట హాట్ బాంబ్‌లా పేరుతెచ్చుకుంది. నెమ్మదిగా సినిమా అవకాశాలు దక్కించుకుంటూ హీరోయిన్ గా బిజీ అవుతుంది.
ఇటీవల `బిచ్చగాడు2`లో బోల్డ్ గా చేసి మెప్పించింది. ఓ సాంగ్‌లో రెచ్చిపోయి స్కిన్ షో చేసింది. రొమాంటిక్ సీన్లలో నెక్ట్స్ లెవల్ చూపించింది. ఈ సినిమా హిట్ కావడంతో ఈ బ్యూటీకి పేరొచ్చింది. అంతకు ముందు `ఏక్ మినీ కథ`లోనూ బెడ్ సీన్లు చేసి ఆశ్చర్యపరిచింది. అందాల ఆరబోతలో హద్దులు లేవని చాటుకుంది. రొమాంటిక్ సీన్లలోనూ రెచ్చిపోతూ మేకర్స్ ని సర్‌ప్రైజ్ చేసింది.
అయితే ఇప్పటి వరకు పెద్ద ప్రాజెక్ట్ లు పడలేదు ఈ బ్యూటీకి. కానీ సైలెంట్‌గా ఈ సెక్సీ భామ ఆఫర్లు అందుకుంటుంది. పెద్ద హీరోలతో జోడీ కట్టే ఛాన్స్ అందుకుని దూసుకుపోతుంది. తాజాగా ఈ భామ రెండు ఆఫర్లు దక్కించుకుందట. ఒకటి ఐటెమ్ సాంగ్ కాగా, మరోటి ఏకంగా హీరోయిన్ గానే అని తెలుస్తుంది. రామ్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో `డబుల్ ఇస్మార్ట్` చిత్రం రూపొందుతుంది. ఇందులో రామ్, కావ్యా థాపర్‌లపై ఓ స్పెషల్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇందులో ఈ సాంగ్ చాలా ప్రత్యేకంగా ఉంటుందని, ఆమెకి పేరు తెచ్చేలా ఉంటుందని సమాచారం.
మరోవైపు గోపీచంద్‌తో సినిమా ఆఫర్‌ని దక్కించుకుందట. ఇటీవల శ్రీనువైట్లతో గోపీచంద్ ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది ఓపెనింగ్ కూడా జరుపుకుంది. ఇందులో హీరోయిన్‌గా కావ్యా థాపర్‌ని ఫైనల్ చేశారట. దీంతో కావ్యాకిది పెద్ద ప్రాజెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. అయితే సినిమా హిట్ అయితే ఆమె నెక్ట్స్ లెవల్ కి వెళ్తుంది, లేదంటే మళ్లీ సీన్ మొదటికొస్తుంది. ఏదైనా సక్సెస్‌లే అవకాశాలు తీసుకొస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ప్రస్తుతం ఈ రెండు ఆఫర్లు ఈ సెక్సీ బ్యూటీని రెండు రకాలుగా టర్న్ తిప్పబోతున్నాయి. హీరోయిన్‌గా సినిమా సక్సెస్ అయితే హీరోయిన్‌గా సినిమాలొస్తాయి. లేదంటే స్పెషల్ సాంగ్ చేస్తున్న `డబుల్ ఇస్మార్ట్ `హిట్ అయితే ఇక అలాంటి ఐటెమ్ సాంగులే ఎక్కువగా వస్తాయి. ఇది హీరోయిన్‌గా ఆమె కెరీర్‌పై ఇంపాక్ట్ చూపిస్తుంది. మరి కావ్య కెరీర్ ఇప్పుడు రింగ్ రోడ్డుపై ఉందని చెప్పొచ్చు. మరి అది ఎటు టర్న్ తీసుకుంటుందో చూడాలి.