బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందుతోన్న చిత్రం 'కవచం'. కాజల్ అగర్వాల్, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నాడు. శ్రీనివాస్ మామిళ్ళ అనే వ్యక్తి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాఉంనారు. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. 

దీపావళి కానుకగా సినిమా టైటిల్ పోస్టర్ ని విడుదల చేసిన చిత్రబృందం తాజాగా టీజర్ ని విడుదల చేసింది. 'భయపెట్టే వాడికి భయపడే వాడికి మధ్య కవచంలా ఒకడు ఉంటాడు రా.. వాడే పోలీస్'.. 'పోలీసోడితో ఆడాలంటే బులెట్ కంటే బ్రెయిన్ ఫాస్ట్ గా ఉండాలి' అంటూ హీరో చెప్పే డైలాగులు ఆకట్టుకున్నాయి.

ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ కీలక పాత్రలో నటించగా పోసాని కృష్ణముర‌ళి, స‌త్యం రాజేష్, అపూర్వ ఇతర పాత్రల్లో నటించారు. ఇప్పటికే 'క‌వ‌చం' షూటింగ్ పూర్తయింది. కేవ‌లం పాట‌ల చిత్రీక‌ర‌ణ మాత్రమే మిగిలి ఉంది.

ఎస్.ఎస్.థ‌మ‌న్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి ఛోటా కే నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. డిసంబర్ లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.