బిగ్ బాస్ రియాలిటీ షోపై గత కొన్ని రోజులుగా ఆరోపణలు వస్తోన్న సంగతి తెలిసిందే.. కొందరు నటీమణులు బిగ్ బాస్ షో ఎంపిక ప్రక్రియలో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఈ షోని నిలిపివేయాలని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి వంటి నిర్మాతలు పిటిషన్ దాఖలు చేశారు.

ఈ కార్యక్రమ నిర్వాహకుడు అభిషేక్ ముఖర్జీపై సినీ నటి గాయత్రి గుప్తా ఫిర్యాదు చేశారు. దీంతో ఈ షో వాయిదా పడుతుందనే వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో బిగ్ బాస్ 2 విజేత కౌశల్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

బిగ్ బాస్ 2 విజేతగా, ఓ సామాన్య పౌరుడిగా ఈ షోపై తనకు ఎంతో గౌరవం ఉందని, ఈ కార్యక్రమం ఎంపిక చేసే ప్రాసెస్ ఎంతో నిజాయితీగా ఉంటుందని చెప్పారు. బిగ్ బాస్ మూడో సీజన్ లో పాల్గొనబోయేవారికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు.

'ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. మీరు రైడ్ ఎక్కబోతున్నారు' అంటూ బిగ్ బాస్ 3 కంటెస్టంట్స్ కి చెప్పాడు. ఈ షోకి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఈ వారంలోనే షో మొదలుకావాల్సివుంది. కానీ వాయిదా పడే ఛాన్స్ ఉందని టాక్.