కౌశల్ ఆర్మీ మొదలెట్టేసింది.. టార్గెట్ తనీష్ అండ్ బాబు..?

First Published 7, Aug 2018, 11:37 AM IST
kaushal army targets tanish and babu gogineni
Highlights

కౌశల్ ఆర్మీ మాత్రం తనీష్, బాబు గోగినేనిలలో కనీసం ఒకరినైనా బయటకి పంపాలని ఓటింగ్ పై దృష్టి పెట్టారు. మరి వారు టార్గెట్ చేసినట్లుగా వీరిద్దరిలో ఒకరు బయటకి వెళ్తారేమో చూడాలి

బిగ్ బాస్ 2 ఎలిమినేషన్ ప్రాసెస్ లో కౌశల్ ఆర్మీ ప్రభావం చూపిస్తోన్న సంగతి తెలిసిందే. నామినేషన్ లో కౌశల్ ఉంటే అతడిని కాపాడడానికి ఓట్లు వేస్తున్నారు. తను లేడంటే మాత్రం హౌస్ లో కౌశల్ కి వ్యతిరేకంగా ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో వాళ్లని బయటకి పంపేలా చూస్తున్నారు. బిగ్ బాస్ షోని ఈ కౌశల్ ఆర్మీ శాసిస్తోందనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి. చాలా కాలంగా కౌశల్ ఆర్మీ దృష్టి తనీష్, బాబు గోగినేనిలపై పడింది.

కానీ వారు ఎక్కువగా నామినేషన్స్ కి రాకపోవడంతో వారి టార్గెట్ మిస్ అయింది. అయితే ఈసారి ఆ ఇద్దరు నామినేషన్స్ లో ఉన్నారు. బాబు గోగినేని నిన్న నామినేషన్స్ కోసం పెట్టిన టాస్క్ లో పోటీ ఇవ్వకుండా.. ఆడవాళ్లని తోసేసి నెగ్గలేనని వివరణ ఇచ్చాడు. ఇక తనీష్.. దీప్తి సునైనాను నామినేషన్స్ నుండి కాపాడి తను ఓడిపోయాడు. ఈ విషయంలో అతడి విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

ఈ వారం ఎలిమినేషన్స్ లో గీతామాధురి, శ్యామల, గణేష్, దీప్తి నల్లమోతు కూడా నామినేట్ అయ్యారు. కానీ కౌశల్ ఆర్మీ మాత్రం తనీష్, బాబు గోగినేనిలలో కనీసం ఒకరినైనా బయటకి పంపాలని ఓటింగ్ పై దృష్టి పెట్టారు. మరి వారు టార్గెట్ చేసినట్లుగా వీరిద్దరిలో ఒకరు బయటకి వెళ్తారేమో చూడాలి!

loader