‘టైగర్3’ కోసం కత్రినా కైఫ్ వర్కౌట్స్.. జిమ్ లో ఎంతలా ప్రాక్టీస్ చేసిందో చూశారా? వీడియోలు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ నెక్ట్స్ ‘టైగర్3‘తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో ఫైట్ సీన్లతో అదరగొట్టనుంది. సినిమా యాక్షన్ సీక్వెన్స్ కోసం ఎలా శ్రమించిందో తాజాగా కొన్ని వీడియోలను పంచుకుంది.
 

Katrina Kaif workouts for her Upcoming film Tiger 3 NSK

దీపావళి కానుకగా బాలీవుడ్ బాయ్ జాన్ సల్మాన్ ఖాన్ - కత్రినా కైఫ్ (Katrina Kaif) జంటగా నటించి యాక్షన్ ఫిల్మ్ Tiger3 ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోఆరు రోజుల్లో చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ప్రస్తుతం యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈక్రమంలో కత్రినా కైఫ్ సైతం తనదైన శైలిలో సినిమాను ప్రమోట్ చేసుకుంటోంది. అయితే, ‘టైగర్3’తో తన యాక్షన్ సీక్వెన్స్ కు సంబంధించిన ప్రాక్టీస్ సెషన్ ను అభిమానులకు పరిచయం చేసింది. జిమ్ లో తను ఎలా వర్కౌట్ చేసిందో వీడియోల ద్వారా తెలిజేసింది.

కత్రినా కైఫ్ తాజాగా పంచుకున్న వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. తన పాత్రకోసం కత్రినా కైఫ్ శ్రమించిన తీరుకు అభిమానులు ఫిదా అవుతున్నారు. యాక్షన్ లో అదరగొట్టేందుకు, బెస్ట్ పెర్ఫామెన్స్ అందించేందుకు ఎంతలా ప్రాక్టీస్ చేసిందో తన పోస్ట్ ద్వారా అర్థమవుతోంది. ఇప్పటికే ‘టైగర్3’ నుంచి వచ్చి ప్రమోషనల్ మెటీరియల్ సినిమాపై అంచనాలను పెంచేసింది. బిగ్ స్టార్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రల్లో నటించారు. యష్ రాజ్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ చిత్రాన్ని మనీశ్ శర్మ దర్శకత్వం వహించారు. 

నవంబర్ 12న ఈ చిత్రం ఇండియాలో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా సినిమాను జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. జోయా, ఐఎస్ఐ ఏజెంట్ గా నటించిన కత్రినా కైఫ్ తన పాత్రపై మరింత ఆసక్తి పెంచేలా ఇంట్రెస్టింగ్ పోస్టులు పెడుతూ వస్తోంది. లేటెస్ట్ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. బాలీవుడ్ హీరో విక్కీ కౌషల్ ను పెళ్లాడిన కత్రినా కైఫ్.. మ్యారేజ్ తర్వాత సినిమా జోరు కాస్తా తగ్గించింది. చివరిగా ‘ఫోన్ భూత్’ చిత్రంతో అలరించింది. ‘టైగర్3’ తర్వాత.. సౌత్ స్టార్ విజయ్ సేతుపతితో కలిసి ‘మేరీ క్రిస్టమస్’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Katrina Kaif (@katrinakaif)

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios