సినీ తారల ప్రేమ వ్యవహారాల గురించి అనేక వార్తలు వస్తుంటాయి. కొందరి గురించి నిజం లేకున్నా రూమర్స్ వస్తుంటాయి. మరికొందరు సెలెబ్రిటీలు ప్రేమలో ఉన్నపటికీ మీడియాకు దొరకకుండా తప్పించుకుంటుంటారు. రణబీర్ కపూర్ తో డేటింగ్ చేస్తున్నప్పుడు కూడా కత్రినా కైఫ్ ఇలానే చేసింది. రణబీర్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు లీకైనా తామిద్దరం మంచి స్నేహితులమే అని తప్పించుకుంది. 

రణబీర్ కపూర్ తో కత్రినా బ్రేకప్ అయి చాలా కాలం అవుతోంది. లవ్ ఫెయిల్యూర్ బాధనుంచి క్రమంగా బయటపడుతూ అన్ని సంగతులని మీడియాకు వివరిస్తోంది. ఇటీవల కత్రినాకు తన పర్సనల్ లైఫ్ గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి కత్రినా సమాధానం ఇస్తూ నా ప్రేమ వ్యవహారాల గురించి మీడియాకు ఆసక్తి ఎక్కువ. సమాధానం చెప్పకపోతే పొగరు అనుకుంటారు. 

అందుకే నా పర్సనల్ లైఫ్ గురించి కొన్ని విషయాలు మాత్రం వెల్లడించగలను. నేను, రణబీర్ కపూర్ విడిపోయిన మాట వాస్తవమే. కానీ అతడిపై నాకు ఇప్పటికి గౌరవం ఉంది. చాలా కాలం పాటు ప్రేమలో విఫలమైన బాధ నన్ను వేధించింది. అదే సమయంలో నా చెల్లి ప్రేమ కూడా ఫెయిల్ అయింది. కానీ నేను సెలెబ్రిటీని. పదే పదే ప్రేమని గుర్తు చేసుకుని బాధపడేదాన్ని. 

సెలెబ్రెటీలకు వ్యక్తిగత విషయాల్లో కూడా కష్టాలు ఎక్కువగా ఉంటాయని అప్పుడే తెలిసింది. కానీ నేను, నా చెల్లి మాత్రం ప్రేమ వల్లే ఆ సమయంలో ఇబ్బంది పడ్డాం. పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుని ఆ బాధ నుంచి బయటపడ్డా అని కత్రినా అంటోంది.