బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గతంలో రణబీర్ కపూర్ తో ప్రేమాయణం నడిపించింది. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలు వేసుకొని తిరగడం, విదేశాలకు ట్రిప్ లకు వెళ్లడం వంటివి చేసేవారు. దానికి సంబంధించిన ఫోటోలు మీడియాకి దొరకడంతో వీరి వ్యవహారం బయటకి వచ్చింది.

ఇద్దరూ కలిసి కొన్నాళ్లు సహజీవనం చేశారని వార్తలు వచ్చాయి. పెళ్లి కూడా చేసుకోబోతున్నారని బాలీవుడ్ మీడియా కథనాలు ప్రచురించింది. కానీ కొన్ని విభేదాల కారణంగా ఈ జంట విడిపోయింది.

అయితే తన ప్రేమ, పెళ్లి విషయాల గురించి కత్రినా.. ఎక్కడా మాట్లాడలేదు. దానికి సంబంధించిన ప్రశ్నలు ఎదురైనా.. ఆమె స్పందించేది కాదు.. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయంపై మాట్లాడింది.

రణబీర్ పేరుని నేరుగా ప్రస్తావించకుండా.. ఆ బ్రేకప్ తనకు మంచే చేసిందని చెప్పుకొచ్చింది. ఆ బ్రేకప్ కారణంగా తనలో చాలా పరిణతి వచ్చిందని, బ్రేకప్ ని బ్లెస్సింగ్ గా భావిస్తానని స్పష్టం చేసింది. ప్రస్తుతం కత్రినా 'జీరో' సినిమాలో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.